newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఫలితాలకు ముందే బాబుకి పీకే సెటైర్

01-04-201901-04-2019 13:01:39 IST
Updated On 01-04-2019 13:04:43 ISTUpdated On 01-04-20192019-04-01T07:31:39.121Z01-04-2019 2019-04-01T07:31:35.516Z - 2019-04-01T07:34:43.183Z - 01-04-2019

ఫలితాలకు ముందే బాబుకి పీకే సెటైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2014 ఎన్నికల సమయంలో సోషల్ మీడియా మొత్తం నరేంద్ర మోదీ ఫీవర్‌తో  ఊగిపోయింది. నరేంద్ర మోదీని జాతీయ స్థాయిలో హీరోగా ప్రొజెక్ట్ చేసిన ఘనత బీజేపీ సోషల్ మీడియా టీందే అని చెప్పాలి. అట్లాంటి సోషల్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు జగన్ కోసం ప్రశాంత్ కిశోర్ టీమ్ చేస్తోంది. అందుకు నిదర్శనం.. ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో అయినా జగన్ కనిపిస్తున్నాడు. ఇక యూట్యూబ్‌లో అయితే రావాలి జగన్- కావాలి జగన్ పాట ఊపేస్తోంది. 

అప్‌లోడ్ చేసిన వారం రోజుల్లోనే ఈ పాటను కోటిమందికిపైగా చూశారు. ఇప్పటిదాకా మన దేశంలో ఏ రాజకీయ ప్రచారగీతానికీ రానంత ఆదరణ జగన్ పాటకు వచ్చిందని సీఎన్ఎన్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అంటే ఎన్నికలకు ముందే ఈ పాట వైఎస్ జగన్‌ను రాక్ స్టార్‌ని చేసింది. దీనిపై వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ‘బ్రదర్.. ఏపీ ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడానికి ముందే రాక్ స్టార్‌ని చేశారు.  చంద్రబాబుగారూ.. మీ నుంచి విమర్శలు రాకముందే మీకు ధన్యవాదాలు చెప్పేస్తున్నా’ అన్నారు ప్రశాంత్ కిషోర్. 

గతంలో ప్రశాంత్ కిషోర్‌ని చంద్రబాబు బీహారీ బందిపోటు అంటూ విమర్శించారు. అలాంటి వ్యక్తి సలహాలతో రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్‌ను విమర్శించారు. ఈ ప్రచారగీతాన్ని ప్రమోట్ చేయడం వెనుక కీ రోల్ ప్రశాంత్  కిషోర్‌దే కాబట్టి దీనిపై చంద్రబాబు ఎలాగూ విమర్శిస్తారనీ అందుకే ముందే థ్యాంక్స్ అంటూ పీకే సెటైర్ వేశారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle