newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

ప‌వ‌న్ ముందు రెండు ఆప్ష‌న్లు..?

12-01-202012-01-2020 10:17:35 IST
2020-01-12T04:47:35.875Z12-01-2020 2020-01-12T04:47:30.728Z - - 20-01-2020

ప‌వ‌న్ ముందు రెండు ఆప్ష‌న్లు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెగ ప‌శ్చాత్త‌ప్ప‌డుతున్నారు. త‌న పార్టీ దారుణ ఓట‌మికి, తాను శ‌త్రువుగా భావించే జ‌గ‌న్ ఘ‌న విజ‌యానికి దారి తీసిన ప‌రిస్థితుల‌ను గుర్తు తెచ్చుకొని మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఒక ర‌కంగా జ‌గ‌న్ విజ‌యానికి తానే కార‌ణ‌మ‌ని సైతం బాధ‌ప‌డుతున్నారు.

తాను బీజేపీ, టీడీపీతో క‌లిస్తే జ‌గ‌న్ గెలిచే వారే కార‌ని చెబుతున్నారు. అయితే, మ‌రోసారి ఆయ‌న ఆ పార్టీల వైపు చూస్తున్నారా అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఇందుకు తాజాగా పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలే ఉదాహ‌ర‌ణ‌.

ఇటీవ‌ల పార్టీ స‌మావేశంలో వైసీపీ శాస‌న‌స‌భ్యుల‌ను విమ‌ర్శిస్తున్న క్ర‌మంలో.. తాను క‌నుక టీడీపీ, బీజేపీతో క‌లిస్తే మీరు గెలిచే వారా అని ప్ర‌శ్నించారు. ఈ మూడు పార్టీల‌కు క‌లిపి వ‌చ్చిన ఓట్లు ఎన్ని, వైసీపీకి వ‌చ్చిన ఓట్లు ఎన్ని, వైసీపీ గెలిచేదా, ఓడేదా అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే టీడీపీ, బీజేపీతో దూర‌మై త‌ప్పు చేసిన‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తించిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. తాజాగా పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశంలోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్య‌లే చేశారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ భ‌విష్య‌త్‌కు ఒక క‌ఠిన ప‌రీక్ష లాంటివి. ఈ ఎన్నిక‌ల్లో అయినా కొంత మెరుగైన ఫ‌లితాలు సాధిస్తేనే పార్టీకి భ‌విష్య‌త్‌పై ఒక భ‌రోసా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో విస్తృత స్థాయి స‌మావేశంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని ప‌లువ‌రు కీల‌క నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కోరారు. టీడీపీ రాష్ట్రంలో బ‌ల‌మైన విప‌క్షంగా ఉంద‌ని, ఆ పార్టీతో మ‌ళ్లీ క‌లిసి వెళితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేదు.

వాస్త‌వానికి, టీడీపీతో దూర‌మైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు ప‌ట్ల‌, చంద్ర‌బాబుకు ప‌వ‌న్ ప‌ట్ల ఒక సాఫ్ట్ కార్న‌ర్ ఉంటుంది. తాము దూర‌మై ఇద్ద‌ర‌మూ న‌ష్ట‌పోయామ‌నే భావ‌న ఇద్ద‌రు నేత‌ల్లోనూ ఉంది. ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చంద్ర‌బాబు గొప్ప‌గా మాట్లాడుతున్నారు.

చంద్ర‌బాబుకు అనుకూలంగా ప‌వ‌న్ స్పందిస్తున్నారు. జ‌న‌సేన ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో టీడీపీ భాగ‌మ‌వుతోంది. ఇలా రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే ఉంది. అయితే ఈ సంబంధం మ‌ళ్లీ పొత్తుల‌కు దారి తీస్తుందా అనే చ‌ర్చ సాగుతోంది.

కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూస్తున్నార‌ని తెలుస్తోంది. న‌రేంద్ర మోడీ, అమిత్ షాతో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, వారికి ఫిర్యాదు చేస్తానంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను త‌ర‌చూ ప‌వ‌న్ బెదిరిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇప్పుడు బీజేపీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డానికి ఢిల్లీ వెళ్లారు. బీజేపీతో మంచి సంబంధాలు ఉండాల‌ని ప‌వ‌న్ కోరుకుంటున్నారు.

అయితే, టీడీపీతో క‌లిస్తే మాత్రం ప‌వ‌న్‌ను బీజేపీ దూరం పెట్టే అవ‌కాశం ఉంది. టీడీపీతో బీజేపీకి పూర్తిగా చెడిపోయినందున మ‌ళ్లీ ఆ పార్టీతో బీజేపీ క‌లిసే అవ‌కాశాలు చాలా త‌క్కువ. అంటే, ప‌వ‌న్ టీడీపీ, బీజేపీలో ఏదో ఒక పార్టీతో క‌లిసి వెళ్లాల్సి ఉంటుంది.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle