newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ప‌వ‌న్ ప‌వ‌ర్ చూపిస్తున్నారా..?

31-10-201931-10-2019 07:26:35 IST
Updated On 31-10-2019 15:17:19 ISTUpdated On 31-10-20192019-10-31T01:56:35.549Z31-10-2019 2019-10-31T01:56:19.508Z - 2019-10-31T09:47:19.822Z - 31-10-2019

ప‌వ‌న్ ప‌వ‌ర్ చూపిస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరుకు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలో ఇసుక కొర‌త కార‌ణంగా ప‌నులు దొర‌క‌క ఇబ్బందులు ప‌డుతున్న భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు బాస‌ట‌గా 3వ తేదీన భారీ ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా లాంగ్ మార్చ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న జ‌న‌సేన విజ‌య‌వంతం చేయాల‌ని భావిస్తోంది.

అంతేకాదు, ఈ కార్య‌క్ర‌మం వేదిక‌గా ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిని త‌ల‌కెత్తుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాము నిర్వ‌హించ త‌ల‌పెట్టిన లాంగ్ మార్చ్‌కు అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సీపీఎం నేత మ‌ధు, సీపీఐ నేత రామ‌కృష్ణ‌కు స్వ‌యంగా ఫోన్ చేసి మాట్లాడారు.

లాంగ్ మార్చ్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిందిగా ఆయ‌న వీరిని ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అన్ని వ‌ర్గాలు క‌లిసి పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న వారి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయా పార్టీల నేత‌లు సానుకూలంగా స్పందించారు. అయితే, ఎవ‌రెవ‌రు జ‌న‌సేన జెండాపై నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌నేది వేచి చూడాల్సి ఉంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోన్ చేసిన వారంతా పాత మిత్రులే. చంద్ర‌బాబు నాయుడు, బీజేపీతో ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేశారు. ఈ రెండు పార్టీల‌కూ ప‌వ‌న్‌పైన సాఫ్ట్ కార్న‌ర్ ఉంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన స్థానాల్లో ప్ర‌చారం చేయ‌లేద‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు ఇటీవ‌ల అంగీక‌రించారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో త‌మ ఓట‌మికి ప‌వ‌న్ దూర‌మ‌వ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని, మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి ప‌నిచేస్తే బాగుంటుంద‌ని టీడీపీ లోలోన భావిస్తోంది. దీంతో చంద్ర‌బాబు స్వ‌యంగా హాజ‌రుకాక‌పోయినా జ‌న‌సేన కార్య‌క్ర‌మానికి సంఘీభావం తెలిపి పార్టీ త‌ర‌పున ప్ర‌తినిధుల‌ను పంపించే అవ‌కాశం ఉంది.

ఇక‌, బీజేపీ కూడా ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తోంది. తామే అస‌లైన ప్ర‌తిప‌క్షం అని ప‌దేప‌దే చెబుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ కోరిక‌ను బీజేపీ మన్నిస్తుందా, లాంగ్ మార్చ్‌లో ప‌వ‌న్‌తో క‌లిసి న‌డుస్తుందా చూడాల్సి ఉంది. కానీ, టీడీపీ వైఖ‌రి బ‌ట్టి బీజేపీ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. ఇక‌, మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌డిచిన సీపీఐ, సీపీఎం మ‌రోసారి లాంగ్ మార్చ్‌లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో పాటు వివిధ అంశాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. జెండాల‌ను, సిద్ధాంతాల‌ను, వైరాల‌ను ప‌క్క‌న‌పెట్టి వేదిక‌లు పంచుకుంటున్నాయి. ఇది కేసీఆర్ ప్ర‌భుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోక‌పోయినా ప్ర‌జ‌ల్లో మాత్రం పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో ప్ర‌తిపక్షాలు ఏక‌మైతే జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. అయితే, ఇదే స‌మ‌యంలో ఐదు నెల‌ల కొత్త ప్ర‌భుత్వంపై అంద‌రూ ఒక్క‌టై పోరాడుతున్నార‌ని జ‌గ‌న్ ప‌ట్ల ఒక సానుభూతి కూడా ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle