newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లే..!

03-11-201903-11-2019 07:22:56 IST
2019-11-03T01:52:56.371Z03-11-2019 2019-11-03T01:52:51.681Z - - 16-11-2019

ప‌వ‌న్ క‌ళ్యాణ్ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ యూట‌ర్న్ తీసుకునేందుకు సిద్ధ‌మయ్యారు. ఇంత‌కుముందు తాను చెప్పిన మాట‌కు భిన్నంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, త‌న జీవితం పూర్తిగా రాజ‌కీయాల‌కే అని చెప్పిన ఆయ‌న మ‌ళ్లీ పార్ట్‌టైమ్ పొలిటీష‌న్‌గా మారిపోతున్నారు. మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

2014లోనే జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడూ పూర్తి స్థాయి రాజ‌కీయ నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. 2014లో పోటీకి సైతం దూరంగా ఉండి టీడీపీ - బీజేపీకి ప్ర‌చారం చేసిన ఆయ‌న ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌కు ప‌రిమితం అయ్యారు. అడ‌పాద‌డ‌పా మూడు నెల‌లో, ఆరు నెల‌లో ఓసారి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే వారు.

కానీ, 2019 ఎన్నిక‌ల ముందు మాత్రం ఆయ‌న ఫుల్‌టైమ్ రాజ‌కీయ నేత‌గా మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాను 25 ఏళ్లు రాజ‌కీయాలు చేయ‌డానికి వ‌చ్చాన‌ని, ఇక పూర్తిగా ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని చెప్పారు. కానీ, నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన జ‌గ‌న్ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. ఫ‌లితంగా జ‌న‌సేన దారుణంగా ఓడిపోవ‌డంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.

అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నైరాశ్యం చెంద‌లేదు. ఒక్క ఓట‌మి త‌న‌ను ఏమీ చేయ‌లేద‌ని, ఇక నుంచి ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వానికి వంద రోజులు స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పిన ఆయ‌న ఆ స‌మ‌యం ముగియ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఆందోళ‌న‌ల‌ను ప్రారంభించారు.

ఇదంతా చూసిన ప‌వ‌న్ అభిమానులు, రాజ‌కీయ విశ్లేష‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల్లోనే ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మంచి ఫ‌లితాలు సాధించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు.

కానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. మళ్లీ సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యించారు. చివ‌ర‌గా 2018లో ఆజ్ఞాత‌వాసి సినిమాతో తెర‌పై క‌నిపించిన ప‌వ‌న్ ఇప్పుడు మ‌రో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు.

బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్‌లో ప‌వ‌న్ న‌టించ‌నున్నారు. దిల్ రాజు, బోనీ క‌పూర్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప‌వ‌న్ రికార్డు స్థాయిలో, గ‌తంలో ఏ తెలుగు హీరో అందుకోనంత పారితోష‌కం కూడా పొందుతున్నార‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా ఒక సినిమా, అందునా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి స్టార్ న‌టించే సినిమా షూటింగ్‌కు క‌నీసం ఆరు నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు.

దీంతో మ‌రో ఏడాది పాటు ప‌వ‌న్ పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్‌గానే మార‌నున్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీకి ప్ర‌త్యామ్నాయ స్థానం కోసం టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ హోరాహోరీ త‌ల‌ప‌డుతున్నాయి.

ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో బిజీ అయితే రేసులో వెనుక‌బ‌డ‌వ‌చ్చు. అయితే, త‌మ నాయ‌కుడికి వ్యాపారాలు లేవ‌ని, సినిమాల్లో న‌టిస్తేనే డ‌బ్బులు వ‌స్తాయ‌ని కాబ‌ట్టి సినిమాల్లో న‌టిస్తున్నార‌ని, అయినా కూడా ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉంటార‌ని ప‌వ‌న్ అభిమానులు చెప్పుకుంటున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle