newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌లు అడియాస‌లేనా..?

21-01-202021-01-2020 16:35:52 IST
Updated On 21-01-2020 17:49:00 ISTUpdated On 21-01-20202020-01-21T11:05:52.805Z21-01-2020 2020-01-21T11:05:50.986Z - 2020-01-21T12:19:00.185Z - 21-01-2020

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌లు అడియాస‌లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జన‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎద‌ర్కోవ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడు కావ‌డంతో ఇక ఆగేదే లేదు అంటున్నారు.

కేంద్రం అండ‌గా ఉంటుంద‌నే ధైర్యంతో ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై పోరులో ప‌వ‌న్ దూకుడు పెంచారు. వాస్త‌వానికి ఆయ‌న కేంద్రం అండ కోస‌మే క‌మ్యూనిస్టుల‌ను, గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు ఉన్న త‌న సిద్ధాంతాల‌ను మార్చుకొని మ‌రీ వెళ్లి బీజేపీతో క‌లిశారు.

బీజేపీతో క‌లిశాక ఆ పార్టీతో క‌లిసి వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాడాల‌ని భావిస్తున్నారు. ముందుగా అమ‌రావ‌తి విష‌యంలోనే వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ యుద్ధం ప్ర‌క‌టించారు. వైసీపీ వినాశ‌నం మొద‌లైంద‌ని, వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల్చేసేవ‌ర‌కు నిద్ర‌పోన‌ని శ‌ప‌థం చేస్తున్నారు.

ఢిల్లీకి వెళ‌తాన‌ని, బీజేపీ పెద్ద‌ల‌తో మాట్లాడి వైసీపీ సంగ‌తి చూస్తాన‌ని వార్నింగ్‌లు ఇస్తున్నారు. మూడు రాజ‌ధానుల విష‌యం కేంద్రంతో చెప్ప‌కుండా వైసీపీ చేస్తోంద‌ని, కాబ‌ట్టి కేంద్రం జోక్యం చేసుకోవాల‌నేది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌.

అయితే, ఈ విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోవ‌డం అనుమాన‌మే. నిన్న‌టి అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి విష‌యంలో బీజేపీని పూర్తిగా ఇరుకున పెట్టేశారు. ఆ పార్టీ 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో హైకోర్టును క‌ర్నూలుకు మారుస్తామ‌ని, అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ అని, అడిగిన రైతుల‌కు భూములు వెన‌క్కు ఇస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పింది. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ లేవ‌నెత్తారు. దీంతో బీజేపీ నేత‌లు డిఫెన్స్‌లో ప‌డిపోయారు.

మ‌రోప‌క్క రాష్ట్ర రాజ‌ధాని విష‌యం పూర్తిగా రాష్ట్రం ప‌రిధిలోని అంశం. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకుంటే సూచ‌న‌లు మాత్ర‌మే చేయ‌గ‌ల‌దు కానీ అంత‌కు మించి రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశాల్లో చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేదు.

ఇదే విష‌యాన్ని బీజేపీకి ద‌క్షిణాధి నుంచి ఉన్న ఏకైక అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహ‌రావు నొక్కి చెబుతున్నారు. పార్టీ ప‌రంగా తాము వైసీపీ వైఖరిపై పోరాడినా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఈ విష‌యంలో జోక్యం చేసుకోద‌ని చెబుతున్నారు.

అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు సుజ‌నా చౌద‌రి లాంటి కొంద‌రు బీజేపీ నేత‌లు ప‌దేప‌దే కేంద్రం చూస్తూ ఊరుకోద‌ని, జోక్యం చేసుకుంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పీపీఏల పునఃస‌మీక్ష‌, రివ‌ర్స్ టెండ‌రింగ్‌ల విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేసిందే కానీ ఎక్క‌డా నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఇక‌, అమ‌రావ‌తిలో విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంటే రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అందుకు ధీటుగానే స్పందించే అవ‌కాశం ఉంది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని కేంద్రం చెబితే.. విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్రం వైఖ‌రిని ప్ర‌శ్నిస్తుంది. అమ‌రావ‌తి నిర్మాణానికి ల‌క్ష కోట్లు కావాల‌ని, ఆ స‌హాయం కేంద్ర ప్ర‌భుత్వ‌మే చేయాల‌ని అడ‌గ‌వ‌చ్చు.

ఇప్ప‌టికే మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఇవే అంశాల‌ను లేవ‌నెత్తారు. కాబ‌ట్టి, అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోవ‌డం అనుమాన‌మే. అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు కొంద‌రు బీజేపీ నేత‌ల ఆశ‌లు నెర‌వేర‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle