newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రైట్ ట‌ర్న్ తీసుకుంటున్నారా..?

26-11-201926-11-2019 09:03:24 IST
Updated On 26-11-2019 14:54:53 ISTUpdated On 26-11-20192019-11-26T03:33:24.932Z26-11-2019 2019-11-26T03:33:20.255Z - 2019-11-26T09:24:53.882Z - 26-11-2019

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రైట్ ట‌ర్న్ తీసుకుంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా స్పీడ్ పెంచారు. వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉద్య‌మ కార్యాచరణ రూపొందిస్తున్నారు.

వ‌రుస ట్వీట్ల‌తో వైసీపీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డుతున్నారు. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. అయితే, ఇటీవ‌లి ప‌రిణామాలు మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు చూస్తున్నార‌నే ఊహాగానాల‌కు తావిస్తున్నాయి.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బీజేపీలో చేరిన రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీలోకి వ‌స్తే బాగుంటుంద‌ని చెప్పారు. అయితే, ఇందుకు గానూ పై స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పారు.

అంత‌కుముందు అమెరికాలో జ‌రిగిన ప్ర‌వాసాంధ్రుల స‌మావేశానికి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రుకాగా,  ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లిన బీజేపీ కీల‌క నేత రాంమాధ‌వ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూరుస్తున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ప‌దేప‌దే కేంద్రం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పేరు చెప్పి భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

జ‌గ‌న్‌పై కేసులు ఉన్నందున కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌తార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్న‌ట్లు ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది.

న‌రేంద్ర మోడీ త‌న‌ను ఎంతో అభిమానిస్తార‌ని, మోడీని సైతం తాను అభిమానిస్తాన‌ని ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లుమార్లు గుర్తు చేశారు. ఇక‌, వారం క్రితం ఢిల్లీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లివ‌చ్చారు. ఈ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను జ‌న‌సేన ఎక్క‌డా భ‌య‌ట‌కు రానివ్వ‌లేదు.

ప‌వ‌న్ ఢిల్లీలో ఎవ‌రెవ‌రిని క‌లిసిందీ చెప్ప‌లేదు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అక్క‌డ ఎవ‌రి అపాయింట్‌మెంట్‌లు దొర‌క‌లేద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తున్నా.. ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక వ్యూహం వేరే ఉండొచ్చ‌నే అనుమానం ఆ పార్టీలోనూ ఉంది.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్ర‌సంగంలో, ట్వీట్ల‌లో తెస్తున్న మ‌త ప్ర‌స్తావ‌న కూడా ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్నారా అనే అనుమానాల‌ను క‌ల‌గ‌జేస్తోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క్రైస్త‌వుడు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు.

జ‌గ‌న్ తిరుప‌తి ల‌డ్డూలు తింటారో, తిన‌రో అనే ఓ అనుమానాన్ని కూడా వ్య‌క్తం చేశారు. ఇక‌, జ‌గ‌న్ నిర్ణ‌యాలు కూడా హిందుత్వానికి, ఆల‌యాల‌కు న‌ష్టం చేసే విధంగా ఉన్నాయ‌నేలా ప‌వ‌న్ ట్వీట్లు చేస్తున్నారు.

వాస్త‌వానికి జ‌న‌సేన సిద్ధాంతానికి ఇది వ్య‌తిరేకం. కులం, మ‌తం ఆధారంగా త‌న రాజ‌కీయాలు ఉండ‌వ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లుమార్లు చెప్పారు. ఇప్పుడు ఇందుకు భిన్నంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్నార‌నే సంకేతాలు పంపుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యామ్నాయం అవ్వాల‌ని వ్యూహాలు ప‌న్నుతున్న బీజేపీకి ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వ్య‌క్తి చాలా అవ‌స‌రం. అందుకే ఐవైఆర్ లాంటి బీజేపీ నేత‌లు ప‌వ‌న్ త‌మ పార్టీలోకి రావాల‌ని కోరుకుంటున్నారు.

అయితే, సొంతంగా జ‌న‌సేన పార్టీని స్థాపించి ఆరేళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌డిపిస్తున్నారు. ఇప్పుడు త‌న పార్టీని బీజేపీలో క‌లిపేందుకు ఆయ‌న సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌చ్చు. త‌న సోద‌రుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన నిర్ణ‌యం త‌ప్పుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తుంటారు.

కాబ‌ట్టి, ప‌వ‌న్ కూడా ఇటువంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌చ్చ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. అయితే, బీజేపీలో గ‌తంలో ప‌ని చేసిన అనుభ‌వం ఉండ‌టం వ‌ల్ల ఇప్పుడు కూడా క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలు మాత్రం లేక‌పోలేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle