newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ప‌వ‌న్ ఇక ఫుల్ టైమ్ పొలిటీషియన్‌..!

29-07-201929-07-2019 08:16:14 IST
Updated On 29-07-2019 13:13:55 ISTUpdated On 29-07-20192019-07-29T02:46:14.708Z29-07-2019 2019-07-29T02:46:08.705Z - 2019-07-29T07:43:55.155Z - 29-07-2019

ప‌వ‌న్ ఇక ఫుల్ టైమ్ పొలిటీషియన్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నిక‌ల్లో కింగ్ కాలేక‌పోయినా కింగ్‌మేక‌ర్‌గా అవ‌త‌రిస్తామ‌నుకున్న జ‌న‌సేన పార్టీ ఆశ‌లు ఆవిరయ్యాయి. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భంజ‌నంలో జ‌న‌సేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఏకంగా ఆ పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రెండు స్థానాల్లో ఓడిపోయారు.

అయితే, ఆయ‌న ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఆయ‌న పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్ అనే ముద్ర ప‌డ‌టం కూడా ఒక‌టి. ఎన్నిక‌ల‌కు ముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఏదో ఓ అధికారిక ప‌ర్య‌ట‌న పెట్టుకొని జిల్లాలు తిరుగుతూ ప్ర‌జ‌ల్లో ఉండేవారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండే జ‌గ‌న్మోహన్ రెడ్డి సైతం నిత్యం ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఆయ‌న గెలుపున‌కు కూడా ప్ర‌ధాన కార‌ణం ఇదే. వీరిద్ద‌రికీ ప్ర‌త్యామ్నాయం అవుతార‌నుకున్న ప‌వన్ క‌ళ్యాణ్ మాత్రం ఈ విష‌యంలో చాలా వెనుక‌బ‌డ్డారు. రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌లు, ఉద్దానం కిడ్నీ వ్యాధుల స‌మ‌స్య వంటి వాటిపై ఆయ‌న కొంత పోరాటం చేసినా ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉన్న రోజులు త‌క్కువే. దీంతో ఆయ‌న‌ను ప్ర‌త్యామ్నయంగా చూడ‌లేదు ప్ర‌జ‌లు.

ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైలెంట్ అవుతార‌ని అంతా అనుకున్నారు. కానీ, ప‌వ‌న్ మాత్రం తాను ఓట‌మిని ఎదుర్కునేందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని, 25 ఏళ్ల పాటు రాజ‌కీయం చేయ‌డానికి వ‌చ్చాన‌ని, పార్టీని బ‌లోపేతం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించి పార్టీ క్యాడ‌ర్‌లో ధైర్యం నింపారు. త‌ర్వాత ఆయ‌న పార్టీలో ప‌లు క‌మిటీల‌ను నియ‌మించారు. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నుండ‌టంతో అప్ప‌టిలోగా పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

జ‌న‌సేన పార్టీ స్థాపించి ఐదేళ్లు ముగిసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఎక్క‌డా సంస్థాగ‌త నిర్మాణం స‌రిగ్గా జ‌రగ‌లేదు. ఇదే స‌మ‌యంలో వైసీపీ, టీడీపీలు బూత్ స్థాయి నుంచి క‌మిటీలు ఏర్పాటు చేసుకొని సంస్థాగ‌తంగా ప‌టిష్ఠంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే జ‌న‌సేన కూడా సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తించారు. ఇందుకోసం ఆయ‌న రాష్ట్ర స్థాయి నుంచి క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. న‌లుగురు స‌భ్యుల‌తో పోలిట్‌బ్యూరోను ఏర్పాటు చేశారు. 11 మంది స‌భ్యుల‌తో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీని నియ‌మించారు.

29వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పార్టీ నాయ‌కులు, వివిధ క‌మిటీల స‌భ్యుల‌తో వ‌రుస స‌మావేశాలు ఏర్పాటు చేయ‌నున్నారు. న‌ర‌సాపురం, కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశం అవుతారు. తమ‌కు కొంత‌మేర ప‌ట్టున్న‌ ప్రాంతం కావ‌డంతో ముందు ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బలోపేతం చేసే దివ‌గా పార్టీ శ్రేణుల‌కు ప‌వ‌న్ దిశానిర్దేశం చేస్తారు.

ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానాలు గెలుచుకోవాల‌నే ల‌క్ష్యంతో ప‌వన్ క‌ళ్యాణ్ ఉన్నార‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా పార్టీ అధినేత‌లు నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచ‌న‌లు ఇస్తుంటారు. ఏక‌ప‌క్షంగా ఈ వ్య‌వ‌హారం సాగుతుంది. కానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల‌ను సైతం తీసుకొని ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న పార్టీ నేత‌లతో ముఖాముఖి నిర్వ‌హించి అంద‌రి అభిప్రాయాల‌నూ గౌర‌వించాల‌ని భావిస్తున్నారు. 

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   10 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   10 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   18 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle