newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ప‌వ‌న్‌ను ఓడించేందుకు వారంతా ఒక్క‌ట‌వుతున్నారా..?

31-03-201931-03-2019 17:04:50 IST
2019-03-31T11:34:50.664Z31-03-2019 2019-03-31T11:34:01.728Z - - 20-10-2019

ప‌వ‌న్‌ను ఓడించేందుకు వారంతా ఒక్క‌ట‌వుతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌చ్చితంగా గెలుస్తార‌నే ఉద్దేశ్యంతో జ‌న‌సేన పార్టీ ప్ర‌త్యేకంగా స‌ర్వే చేసి మ‌రీ ఈ స్థానాన్ని ఎంపిక చేశారు. ప‌వ‌న్ స్వంత జిల్లా కావ‌డం, ఆయ‌న స్వంత సామాజ‌క‌వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో భీమ‌వ‌రం సేఫ్ సీట్‌గా భావించారు. కానీ, అక్క‌డ ప‌రిస్థితి రోజురోజుకూ ట‌ఫ్‌‌గా మారుతుంది.

భీమ‌వ‌రం తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇక్క‌డి నుంచి రామాంజ‌నేయులు వ‌రుస‌గా రెండుసార్లు విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌రోసారి బ‌రిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఆయ‌న 2004లో ఎమ్మెల్యేగా గెలిచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయారు. దీంతో ఆయ‌న‌పై సానుభూతి క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు టీడీపీ కంటే వైసీపీ నుంచే ఎక్కువ పోటీ ఎదుర‌వుతోంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓడించేందుకు ఇత‌ర హీరోల అభిమానులు భీమ‌వ‌రంలో ఒక్క‌ట‌వుతున్నారు. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి ప‌వ‌న్‌ను ఓడించాల‌ని భావిస్తున్నారట‌. ఇందుకు కార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌తో గ‌తంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లే అంటున్నారు. కొన్ని రోజుల క్రితం భీమ‌వ‌రంలో ప‌వ‌న్ ఫ్లెక్సీ చింపార‌నే వివాదం చిలికిచిలికి గాలి వాన‌లా మారింది. ప‌వ‌న్‌‌తో పాటు మ‌రో హీరో అభిమానుల మ‌ధ్య గొడ‌వ త‌లెత్తింది. దీంతో 144 వ సెక్ష‌న్ పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

భీమ‌వ‌రంలో ప్ర‌భాస్‌కు చెందిన క్ష‌త్రీయ సామాజ‌క‌వ‌ర్గం ఓటర్లు కూడా పెద్ద‌సంఖ్య‌లోనే ఉన్నారు. ఇక్క‌డ ఆయ‌న‌కు అభిమానులు కూడా ఎక్కువ‌. ఇటీవ‌ల ప‌వ‌న్‌కు ప్ర‌భాస్ మ‌ద్ద‌తు ఇచ్చారంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని వ్య‌తిరేకిస్తూ ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు ఇత‌ర హీరోల అభిమానులు కూడా స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం న‌డిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లే. తామంతా వైసీపీకి మ‌ద్ద‌తివ్వాల‌ని ప్ర‌భాస్ స‌హా ఇత‌ర హీరోల ఫ్యాన్స్ నిర్ణ‌యించుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఇది కొంత ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle