newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ప‌వ‌న్‌కు అంత ఈజీ కాదు..!

25-03-201925-03-2019 09:16:06 IST
2019-03-25T03:46:06.946Z25-03-2019 2019-03-25T03:45:49.134Z - - 18-07-2019

ప‌వ‌న్‌కు అంత ఈజీ కాదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. ఇందుకోసం ఆయ‌న‌కు రెండు సేఫ్ సీట్ల‌ను వెతికిపెట్టింది ఆ పార్టీ. విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స్థానాల నుంచి ఆయ‌న పోటీ చేస్తే సులువుగా గెల‌వ‌వ‌చ్చ‌ని స‌ర్వే ద్వారా తెలుసుకుని ఈ రెండు స్థానాల నుంచి ఆయ‌న రంగంలోకి దిగారు.

గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప‌ల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయ‌న మ‌ళ్లీ టీడీపీ త‌ర‌పున పోటీలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున తిప్ప‌ల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్ద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ యాద‌వ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌. కాపుల త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఆ సామాజ‌క‌వ‌ర్గం వారే ఉన్నారు.

సామాజ‌క‌వ‌ర్గ బ‌లంతో పాటు ఐదేళ్లుగా ప్ర‌జ‌ల్లో ఉండ‌టం, టీడీపీ ప్ర‌భు sత్వం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు త‌న‌కు క‌లిసొస్తాయ‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌ల్లా శ్రీనివాస్ కంటే వైసీపీ అభ్య‌ర్థి తిప్ప‌ల నాగిరెడ్డి గ‌ట్టి పోటీ ఇస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో మున‌స‌బుగా, కార్పొరేట‌ర్ గా ప‌నిచేసిన నాగిరెడ్డికి ఈ ప్రాంతంలో మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్ర‌య‌త్నించారు.

2009లో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి కూడా రెండో స్థానంలో నిలిచారు. 2009లో బ‌ల‌మైన కాపు, యాద‌వ సామాజ‌క‌వ‌ర్గ ఓట్లు ఎక్కువ‌గా టీడీపీకి ప‌డ‌టంతో ఆ పార్టీ సులువుగా విజ‌యం సాధించింది. కానీ, ఈసారి కాపు ఓట్లు ప‌వ‌న్‌కు పోయే అవ‌కాశం ఉండ‌టం నాగిరెడ్డికి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది.

రెండుసార్లు వ‌రుస‌గా ఓడిపోయిన సానుభూతి నాగిరెడ్డిపై ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పైగా ఆయ‌న వ‌య‌స్సు కూడా మీద ప‌డుతుండ‌టంతో ఒక్క అవ‌కాశం ఆయ‌న‌కు ఇద్దామ‌ని చాలా మంది ఓట‌ర్లు ఆలోచిస్తున్నారు. పవ‌న్ స్థానికుడు కాక‌పోవ‌డంతో గెలిచినా ఆయ‌న అందుబాటులో ఉండ‌ర‌నే వాద‌న కూడా ప్ర‌జ‌ల్లో ఉంది. ఇక్క‌డ కాకున్నా ఆయ‌న భీమ‌వ‌రంలో గెలుస్తారులే అని చ‌ర్చించుకుంటున్నారు.

రాష్ట్ర నేత కావ‌డం, కాపుల ఓట్లు అధికంగా ఉండ‌టం, యువ‌త ఎక్కువ‌గా త‌న‌వైపు మొగ్గు చూపుతుండ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌లిసిరావ‌చ్చు. అయితే, త్రిముఖ పోరులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు మాత్రం అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఒక‌వేళ గెలిచినా మెజారిటీ పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. వైసీపీ అభ్య‌ర్థి నుంచి ఆయ‌న గ‌ట్టి పోటీ ఎదుర్కోవ‌చ్చు. మొత్తానికి సేఫ్ సీట్ అనుకున్న గాజువాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌ఠినంగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle