newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ప‌వన్ పార్టీలో ఏమిటీ ప‌రేషాన్‌ ..?

15-12-201915-12-2019 19:48:51 IST
2019-12-15T14:18:51.103Z15-12-2019 2019-12-15T14:18:44.614Z - - 05-08-2020

ప‌వన్ పార్టీలో ఏమిటీ ప‌రేషాన్‌ ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు రోడ్డెక్కుతున్నాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ సిద్ధాంత‌క‌ర్త‌ల్లో ఒక‌రు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యంత స‌న్నిహితుడు రాజు ర‌వితేజ్ జ‌న‌సేన‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌రప్ర‌సాద్ పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేత‌లు పార్టీ వ్య‌వ‌హారాలు, అధినేత వైఖ‌రిపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. దీంతో పార్టీలోని లోటుపాట్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

2014 ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరేళ్ల‌వుతున్నా బాలారిష్టాల‌ను ఎదుర్కుంటూనే ఉంది. అభిమానుల బ‌ల‌మే త‌ప్ప ఇంత‌వ‌ర‌కు ఆ పార్టీకి క్షేత్ర‌స్థాయిలో ఒక రూపం లేదు. వార్డు, గ్రామ స్థాయిల్లో కాకున్నా క‌నీసం మండ‌ల స్థాయిల్లోనూ జ‌న‌సేన ఇంత‌వ‌ర‌కు క‌మిటీల‌ను వేసుకోలేక‌పోయింది. ఓటు బ్యాంకును త‌యారుచేసుకోలేక‌పోయింది.

ఫ‌లితంగా ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో దారుణంగా ఓట‌మిపాల‌య్యింది. ఓడిన త‌ర్వాత పార్టీలో నైరాశ్యం స‌హ‌జ‌మే. దీనిలోంచి తొంద‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చారు అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెలకే ఆయ‌న ప్ర‌భుత్వంపై పోరాటాల‌కు దిగుతున్నారు. గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరు నెల‌లకు ఒక‌సారి కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే వారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా పార్టీ నేత‌ల్లో మాత్రం భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పించ‌లేక‌పోతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. దీంతో వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు జ‌న‌సేన‌ను వీడుతున్నారు. జ‌న‌సేన సిద్ధాంతాన్ని ర‌చించిన ప‌వ‌న్ మిత్రుడు రాజు ర‌వితేజ్ ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన నాయ‌కుడు కాదు. ఆయ‌న పార్టీని వీడ‌టం వ‌ల్ల ఫ‌ల‌నా చోట పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌నేది లేదు. కానీ, ఆయ‌న వెళుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన విమ‌ర్శ‌లు మాత్రం పార్టీకి న‌ష్టం చేసేలా ఉన్నాయి.

కుల‌, మ‌తాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేస్తాన‌ని పార్టీని స్థాపించిన ప‌వ‌న్ త‌ర‌చూ కుల‌, మ‌తాల మ‌ధ్య విద్వేషం పెంచేలా విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్నార‌ని, ఆయ‌న ప్ర‌మాద‌క‌రి శ‌క్తి అని, రాజ్యాంగ ప‌ద‌వుల‌కు అర్హుడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చాలా కాలంగా ప‌వ‌న్‌కు స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తే ఇంత‌టి ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇక‌, పార్టీ ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ శైలిపైన విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం లేద‌ని, ఇలానే ఉంటే భ‌విష్య‌త్ క‌ష్ట‌మేన‌ని అనుమానిస్తున్నారు. ప‌వ‌న్ వైఖ‌రికి భిన్నంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను విధాన‌ప‌రంగా ప్ర‌శంస‌సిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న కూడా జ‌న‌సేన‌కు గుడ్‌బై చెప్పడం ఖాయంగా క‌నిపిస్తోంది.

ప‌వ‌న్‌కు స‌న్నిహితంగా మెలిగిన కొంద‌రు ఇప్ప‌టికే పార్టీని వీడారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప‌వ‌న్ వెన్నంటే ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధ‌రం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన‌లో ప్ర‌ముఖంగా క‌నిపించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు చురుగ్గా లేరు. ఆయ‌న బీజేపీలోకి వెళ్లేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. మాజీ మంత్రులు రావెల కిషోర్‌బాబు, ప‌సుపులేటి బాల‌రాజు వంటి వారూ పార్టీని వీడారు.

బీజేపీని, న‌రేంద్ర మోడీ, అమిత్ షా నాయ‌క‌త్వ‌ప‌టిమ‌ను విశేషంగా కొనియాడిన ప‌వన్ క‌ళ్యాణ్ త‌న క‌మ్యూనిస్టు మిత్రుల‌ను సైతం దూరం చేసుకున్నారు. బీజేపీని కీర్తించిన త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసిన సీపీఐ, సీపీఎం ప‌వ‌న్‌కు గుడ్‌బై చెప్పేశాయి. ఇలా జ‌న‌సేన పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. అయితే, వీటిని పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవడం లేదు ప‌వ‌న్‌. మ‌రి, చేజారిపోతున్న నేత‌ల‌ను కాపాడుకోవ‌డానికి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle