newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ప‌ల్నాడు పంచాయితీకి ప‌రిష్కార‌మేంటి?

13-03-201913-03-2019 07:37:09 IST
Updated On 13-03-2019 19:32:17 ISTUpdated On 13-03-20192019-03-13T02:07:09.837Z13-03-2019 2019-03-13T01:42:54.862Z - 2019-03-13T14:02:17.204Z - 13-03-2019

ప‌ల్నాడు పంచాయితీకి ప‌రిష్కార‌మేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు సీటు వ్య‌వ‌హారం ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స‌మ‌స్య‌గా మారింది. ఆయ‌న‌ను ఎక్క‌డి నుంచి పోటీ చేయించాలో తెలియ‌క ఆయ‌న స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. త‌న ప్ర‌తిపాద‌న‌కు కోడెల అంగీక‌రించ‌క‌పోవ‌డం, కోడెల ప్ర‌తిపాద‌న‌ల‌కు తాను అంగీక‌రించ‌లేక‌పోవ‌డంతో ఇప్పుడు గుంటూరు జిల్లాలోని ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాల అభ్య‌ర్థుల పంచాయితీ అస్స‌లు తెగ‌డం లేదు.

న‌ర‌స‌రావుపేట‌ నియోజ‌క‌వ‌ర్గంతో కోడెల శివ‌ప్ర‌సాదరావుకు చాలా అనుబంధం ఉంది. ఆయ‌న ఇక్క‌డి నుంచి ఏడుసార్లు పోటీ చేసి వ‌రుస‌గా ఐదుసార్లు విజ‌యం సాధించి రికార్డు సృష్టించారు. కానీ, 2004, 2009లో ఆయ‌న‌పై కాంగ్రెస్ అభ్య‌ర్థి కాసు వెంక‌ట‌కృష్ణారెడ్డి గెలుపొందారు. దీంతో 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మారి స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై ఆయ‌న స్వ‌ల్ప మెజారిటీతో గ‌ట్టెక్కారు. త‌ర్వాత స్పీక‌ర్ ప‌ద‌వి చేప‌ట్టారు.

స‌త్తెన‌ప‌ల్లికే ఎమ్మెల్యేగా ఉన్నా త‌న ప‌రిచ‌యాల‌తో పెద్ద ఎత్తున నిధులు తీసుకువ‌చ్చి సత్తెన‌ప‌ల్లితో పాటు న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి కృషి చేశారు. న‌ర‌స‌రావుపేట‌లో వైసీపీ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నా అభివృద్ధిలో మాత్రం కోడెల త‌న ముద్ర వేసుకున్నారు. దీంతో ఈసారి న‌ర‌స‌రావుపేట‌లోనే త‌న ప‌రిస్థితి మెరుగైంద‌ని కోడెల భావిస్తున్నారు.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న అభివృద్ధిలో మంచి మార్కులే వేయించుకున్న కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణపై అవినీతి ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఆయ‌న అవినీతికి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు క‌లిసి అఖిల‌పక్షంగా ఏర్ప‌డి మ‌రీ పోరాడాయి. దీంతో సత్తెన‌ప‌ల్లిలో కోడెల‌కు అంత ఈజీ కాద‌నే భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అనారోగ్య కార‌ణాల రిత్యా తాను ఎంపీగా పోటీ చేయ‌న‌ని, త‌న కుమారుడు రంగారావుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరారు.

సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మ‌ళ్లీ కాపాడుకోవాలంటే కోడెల అయితే బెట‌ర్ అని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఎంపీగా వెళ్లాల‌ని ప్ర‌తిపాద‌న పెట్టారు. కానీ కోడెల ఇందుకు సుముఖంగా లేరు. త‌న‌కు ఢిల్లీ రాజ‌కీయాలు స‌రిప‌డ‌వ‌ని, మ‌ళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాన‌ని, త‌న‌కు, త‌న కుమారుడు శివ‌రామ‌కృష్ణకు స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌స‌రావుపేట టిక్కెట్లు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇక‌, ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా యూట‌ర్న్ తీసుకున్నారు.

తాను మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేస్తాన‌ని, త‌న‌తో పాటు త‌న కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ కావాల‌ని అంటున్నారు. దీంతో వీరి వ్య‌వ‌హారాన్ని సెటిల్ చేయ‌డం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారింది.

అయితే, కోడెల‌ను ఎంపీగా పోటీ చేయించి న‌ర‌స‌రావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లి స్థానాలను కోడెల‌, రాయ‌పాటి వార‌సుల‌కు ఇవ్వాల‌ని, అలా అయితేనే ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు న్యాయం చేయ‌వ‌చ్చనే నిర్ణ‌యంతో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి, కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం రాయ‌పాటి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతారా ? కుమారుడిని ఎమ్మెల్యేగా చూసేందుకు కోడెల ఎంపీ బ‌రిలో ఉంటారా చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle