newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ప‌ల్నాటి పౌరుషం చూపిస్తున్న పార్టీలు

11-09-201911-09-2019 08:31:02 IST
2019-09-11T03:01:02.191Z11-09-2019 2019-09-11T03:00:35.312Z - - 15-11-2019

ప‌ల్నాటి పౌరుషం చూపిస్తున్న పార్టీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఏకంగా ప్ర‌తిప‌క్ష నేత ఛ‌లో ఆత్మ‌కూరు కార్య‌క్ర‌మానికి పిలుపునివ్వ‌డం, దీనికి పోటీగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఛ‌లో ఆత్మ‌కూరు అన‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

వైసీపీ త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతోంద‌నే ఆరోప‌ణ‌ల‌తో చంద్ర‌బాబు నాయుడు ప‌ల్నాడులో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, వైసీపీ మాత్రం త‌మ హ‌యాంలో ఎక్క‌డా దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, టీడీపీ హ‌యాంలోనే త‌మ‌పై దాడులు, త‌ప్పుడు కేసులు పెట్టార‌ని ఆరోపిస్తున్నాయి.

రెండు పార్టీలూ ఒకే కార్య‌క్ర‌మానికి, ఒకే ఊరికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ‌డంతో ప‌ల్నాడు ప్రాంతంలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాయ‌ల‌సీమ త‌ర్వాత గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో రాజ‌కీయ క‌క్ష‌లు, గ్రామాల్లో వ‌ర్గ‌విభేదాలు, గొడ‌వ‌లు అధికంగా ఉంటాయి.

గ్రామాల్లో ఈ ప‌రిస్థితులు ఇంకా ఎక్కువ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్క‌డ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక త‌మ పార్టీ సానుభూతిప‌రుల‌పై దాడులు చేస్తున్నార‌ని, దీంతో వారంతా గ్రామాలు వ‌దిలి వెళ్తున్నార‌ని టీడీపీ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఏకంగా గుంటూరులో వైసీపీ బాధితుల కోసం అంటూ ఓ పున‌రావాస శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఉన్న వారిని స్వ‌యంగా వారి ఊర్లలోకి తీసుకెళ్లి ధైర్యం చెప్పాల‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నారు. ఇందుకే రేపు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మ‌కూరు గ్రామానికి వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

అయితే, వైసీపీ నేత‌లు మాత్రం టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొడుతోంది. గ‌త ఐదేళ్ల‌లో ప‌ల్నాడులో త‌మ పార్టీకి చెందిన ఐదుగురు కార్య‌క‌ర్త‌ల‌ను టీడీపీ వారు హ‌త్య చేశార‌ని, అనేక మందిపై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని గుర్తు చేస్తోంది.

తాము అధికారంలోకి వ‌చ్చాక ఆ ప‌రిస్థితి లేద‌ని, ప‌ల్నాడు ప్రాంతం శాంతియుతంగా ఉంద‌ని, చంద్ర‌బాబు వ‌చ్చి చిచ్చు పెట్టాలని చూస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. టీడీపీ పెద్ద ఎత్తున శ్రేణుల‌తో ఛ‌లో ఆత్మ‌కూరు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డంతో వైసీపీ కూడా పోటీగా ఛ‌లో ఆత్మ‌కూరుకు పిలుపునిచ్చింది. త‌మ పార్టీకి చెందిన టీడీపీ బాధితుల‌ను ఆత్మ‌కూరుకు తీసుకువ‌స్తామ‌ని క‌య్యానికి కాలు దువ్వుతోంది.

దీంతో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఇప్ప‌టికే గుంటూరులోని టీడీపీ శిబిరానికి వెళ్లి ఆ పార్టీ సానుభూతిప‌రుల నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు ప‌ల్నాడు ప్రాంతంలో 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్నారు.

ఎటువంటి స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీల‌కు అనుమ‌తి లేద‌ని డీజీపీ కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు. అయితే, రెండు పార్టీలూ వెన‌క్కు త‌గ్గేందుకు సిద్ధంగా లేవు. దీంతో బుధ‌వారం ప‌ల్నాడులో ఏం జ‌ర‌గ‌బోతోందా అనే టెన్ష‌న్ మొద‌లైంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle