newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

ప‌రిటాల వార‌సుడికి ప్ర‌మోష‌న్ అంట‌..!

19-12-201919-12-2019 08:05:06 IST
Updated On 19-12-2019 11:53:34 ISTUpdated On 19-12-20192019-12-19T02:35:06.848Z19-12-2019 2019-12-19T02:34:58.841Z - 2019-12-19T06:23:34.343Z - 19-12-2019

ప‌రిటాల వార‌సుడికి ప్ర‌మోష‌న్ అంట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీలో ప‌రిటాల వారి వారసుడి ప‌రిటాల శ్రీరామ్ కోసం కొత్త ప‌ద‌వి ఎదురు చూస్తోంది. ఇక నుంచి ప‌రిటాల శ్రీరామ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా ఉప‌యోగించుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ నిర్ణ‌యించింది. పార్టీకి దూర‌మ‌వుతున్న యువ‌త‌ను మ‌ళ్లీ ద‌గ్గ‌ర చేసుకోవ‌డానికి శ్రీరామ్‌ను ఉప‌యోగించుకోవాల‌నే ఆలోచ‌న‌లో పార్టీ ఉంది. దీంతో త్వ‌ర‌లోనే శ్రీరామ్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ యువ‌జ‌న విభాగం తెలుగుయువ‌త పేరుతో ఉంటుంది. తెలుగుయువ‌త‌కు అధ్య‌క్షుడిగా రెండేళ్ల నుంచి విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని అవినాష్ కొన‌సాగారు. ఈ ప‌ద‌విలో ఉన్న‌న్ని రోజులు అవినాష్ బాగానే కార్య‌క్ర‌మాలు చేసే వారు. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆయ‌న తెలుగుయువ‌త‌ను యాక్టీవ్‌గా ఉంచారు.

ఇప్పుడు అవినాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం తెలుగుయువ‌త అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీ అయ్యింది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మెజారిటీ యువ‌త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన పార్టీ వైపు ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఆ రెండు పార్టీల‌కు యువ నాయ‌క‌త్వం ఉండ‌ట‌నే ఇందుకు కార‌ణం. యువ‌త‌ను తెలుగుదేశం పార్టీ వైపు ఆక‌ర్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

అందుకే, తెలుగుయువ‌త అధ్య‌క్షుడిగా రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న యువ నేత‌కు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో పరిటాల శ్రీరామ్ పేరును ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న తండ్రి ప‌రిటాల ర‌వికి రాష్ట్ర‌వ్యాప్తంగా ఇమేజ్ ఉండ‌టం, శ్రీరామ్‌కు కూడా గుర్తింపు ఉండ‌టంతో పాటు అన్నింటికి టీడీపీ బ‌ల‌హీనంగా ఉన్న రాయ‌ల‌సీమ‌కు చెందిన నేత కావ‌డంతో ఈ ప‌ద‌వికి అన్ని ర‌కాలుగా శ్రీరామ్ అర్హుడ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే, ప‌రిటాల శ్రీరామ్ ఈ బాధ్య‌త‌లు తీసుకుంటారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం రాప్తాడును చూసుకోవాల్సి ఉంది. ప‌రిటాల కుటుంబానికి కంచుకోట లాంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి శ్రీరామ్‌కు ఊహించ‌ని ఓట‌మి ఎదురైంది. ఏకంగా 25 వేల మెజారిటీతో ఆయ‌న‌పై వైసీపీ అభ్య‌ర్థి, ప‌రిటాల కుటుంబ ప్ర‌త్య‌ర్థి తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి విజ‌యం సాధించారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌రిటాల కుటుంబం ప‌ట్టును త‌గ్గించి, త‌న బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు అన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క్యాడ‌ర్‌ను కాపాడుకుంటూ, రాప్తాడులో ప‌ట్టు కోల్పోకుండా చూసుకోవ‌డం శ్రీరామ్‌కు త‌ప్ప‌నిస‌రి. అందుకే వ‌ర‌దాపురం సూరి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయాక ఈ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు కూడా ప‌రిటాల కుటుంబానికి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అనుకున్నారు.

ప‌రిటాల కుటుంబం నుంచే ఒక‌రు ధ‌ర్మ‌వ‌రం ఇంఛార్జిగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. కానీ, ఇంత‌వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను ప‌రిటాల కుటుంబం తీసుకోలేదు. పూర్తి స్థాయిలో రాప్తాడుపైనే ప‌రిటాల సునీత‌, శ్రీరామ్ దృష్టి పెట్టారు. మ‌రి, చంద్ర‌బాబు తెలుగుయువ‌త అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే ప‌రిటాల శ్రీరామ్ తీసుకుంటారో లేదో చూడాలి.

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle