newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ప‌రిటాల వారి క‌న్ను అటు వైపు ప‌డిందా..?

11-07-201911-07-2019 07:26:35 IST
Updated On 11-07-2019 11:32:48 ISTUpdated On 11-07-20192019-07-11T01:56:35.610Z11-07-2019 2019-07-11T01:56:30.333Z - 2019-07-11T06:02:48.782Z - 11-07-2019

ప‌రిటాల వారి క‌న్ను అటు వైపు ప‌డిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీలో బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబాల్లో ప‌రిటాల కుటుంబం ఒక‌టి. ఆది నుంచీ టీడీపీ ప‌ట్ల వీర‌విధేయ‌త‌తో ఉండే ప‌రిటాల కుటుంబానికి 2019కి ముందు వ‌ర‌కు ఓట‌మి అన్న‌దే తెలియ‌దు. అయితే, ఈ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సునామీ ముందు హేమాహేమీల్లాంటి నేత‌లే కొట్టుకుపోయారు.

త‌మ‌కు తిరుగులేద‌నుకునే రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిటాల కుటుంబానికి ఎదురుదెబ్బ త‌గిలింది. ప‌రిటాల రాజ‌కీయ వార‌సుడిగా వ‌చ్చిన ప‌రిటాల శ్రీరామ్ ఓట‌మిపాల‌య్యారు.

అయితే, తెలుగుదేశం పార్టీ దారుణ ప‌రాభ‌వం త‌ర్వాత ప‌రిటాల కుటుంబం సైతం భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు చూస్తోంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ముందు నుంచీ టీడీపీతోనే ఉన్న వీరు ఇప్పుడు క‌ష్ట‌కాలంలో టీడీపీలోనే ఉండాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి అద‌న‌పు బాధ్య‌త‌లు కూడా తీసుకోవాల‌ని ప‌రిటాల కుటుంబం భావిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున వ‌ర‌దాపురం సూరి విజ‌యం సాధించారు. ఈసారి ఆయ‌నపై వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి విజ‌యం సాధించారు.

సూరి అనూహ్యంగా బీజేపీ కండువా క‌ప్పేసుకున్నారు. దీంతో ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి నాయ‌కుడు లేని ప‌రిస్థితి. దీంతో ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై ప‌రిటాల వారి క‌న్ను ప‌డింద‌ట‌.

ఇక్క‌డ ప‌రిటాల కుటుంబానికి మంచి ప‌ట్టుంది. గ‌తంలో ప‌రిటాల ర‌వి ఉన్న‌ప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భావం చూపేవారు. ఇక్క‌డ వారికి బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది.

దీంతో వ‌ర‌దాపురం సూరి ఎమ్మెల్యేగా ఉన్న స‌మయంలోనూ వీరు ధ‌ర్మ‌వ‌రంలో అప్పుడ‌ప్పుడు జోక్యం  చేసుకునే వారు. ఈ విష‌యంలో ప‌రిటాల‌, వ‌ర‌దాపురం సూరి మ‌ధ్య కొంత కోల్డ్ వార్ కూడా న‌డిచింది.

ఇప్పుడు వ‌ర‌దాపురం సూరి లైన్ క్లీయ‌ర్ కావ‌డంతో ప‌రిటాల శ్రీరామ్ ఈసారి ధ‌ర్మ‌వ‌రంలో త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. చంద్ర‌బాబు కూడా ఈ మేర‌కు డైరెక్ష‌న్స్ ఇచ్చార‌ని స‌మాచారం.

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే సారి ప‌రిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ట‌. ఈసారి ఒక్క‌టే టిక్కెట్ అని చెప్ప‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీత త‌న కుమారుడి కోసం సీటు త్యాగం చేసి పోటీకి దూరంగా ఉన్నారు. వ‌చ్చే సారి మాత్రం ఇద్ద‌రూ పోటీ చేసే అవ‌కాశం ఉంది.

ఇక‌, ప‌రిటాల కుటుంబం ధ‌ర్మ‌వ‌రంలో అడుగుపెడుతుంద‌నే ప్ర‌చారంతో అప్పుడే నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ధ‌ర్మ‌వ‌రంలో హ‌త్యా రాజ‌కీయాలు చేస్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డి ఇప్పటికే ప్ర‌క‌టించారు.

గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రి హ‌త్య‌ల‌కు ప‌రిటాల కుటుంబ‌మే కార‌ణ‌మ‌ని, ముందు వారి కుటుంబాల‌కు క్షమాప‌ణ చెప్పాకే ప‌రిటాల వారు ధ‌ర్మ‌వ‌రంలో అడుగుపెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఫ్యాక్ష‌న్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ధ‌ర్మ‌వ‌రంలో ప‌రిటాల కుటుంబం ఎంట‌రైతే రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా సాగే అవ‌కాశం ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle