newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

ప‌రిటాల కుటుంబానికి బిగ్‌షాక్‌..!

18-12-201918-12-2019 14:50:43 IST
2019-12-18T09:20:43.475Z18-12-2019 2019-12-18T09:20:41.378Z - - 20-01-2020

ప‌రిటాల కుటుంబానికి బిగ్‌షాక్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంతపురం జిల్లా రామ‌గిరి మండ‌లంలో న‌ర్స‌న్న‌కోట ముత్యాల‌మ్మ ఆల‌యం ఉంది. ఈ ఆల‌యానికి ద‌గ్గ‌ర్లోనే ప‌రిటాల కుటుంబానికి చెందిన పొలాలు కూడా ఉంటాయి. ఈ ఆల‌యానికి అనంత‌పురం జిల్లా నుంచే కాకుండా క‌ర్ణాట‌క నుంచి కూడా భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఆదాయం కోట్ల‌లోనే ఉంటుంది. 

ఈ ఆల‌యం గ‌త 27 ఏళ్లుగా ప‌రిటాల కుటుంబం చేతిలోనే ఉంది. పరిటాల సునీత తండ్రి ధ‌ర్మ‌వ‌ర‌పు కొండ‌య్య ఈ ఆల‌యానికి చైర్మ‌న్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ప‌రిటాల కుటుంబ స‌భ్యులు, వారి అనుచ‌రుల‌తో ఏర్పాటైన ప్ర‌యివేటు పాల‌క క‌మిటీనే ఈ ఆల‌యాన్ని నిర్వహిస్తోంది. ఆల‌యానికి కోట్లాది రూపాయ‌ల ఆదాయంతోపాటు బంగారం, వెండికానుక‌లు కూడా భారీగానే వ‌స్తుంటాయి. 

ఈ నేప‌థ్యంలో ఆల‌యంపై ప‌రిటాల కుటుంబం పెత్త‌నానికి వ్య‌తిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆల‌యంపై ప్ర‌యివేటు వ్య‌క్తుల ఆధిప‌త్యాన్ని గ్ర‌హించి ప్ర‌భుత్వ‌మే ఆల‌యాన్ని నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. కోట్లాది రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంటే.., ఆదాయాన్ని దారి మ‌ళ్లిస్తున్నార‌ని, బంగారం, వెండి ప‌క్క‌దారి  ప‌ట్టిస్తున్నారంటూ చాలా కాలంగా ప‌రిటాల ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తూ వ‌స్తున్నారు. 

ఆల‌యం వ‌ద్ద కొబ్బ‌రికాయ‌ల విక్రయం, పార్కింగ్ ఫీజు, మద్యం అమ్మ‌కాల ద్వారానే ఏటా రూ.2కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా. ఈ విక్ర‌యాలన్నీ ప‌రిటాల అనుచ‌రుల ద్వారానే జరుగుతుంటాయ‌ని చెబుతుంటారు. చాలా మంది భ‌క్తులు విరాళాలు ఇస్తుండ‌గా, వాటికి లెక్క‌లు కూడా ప‌రిటాల కుటుంబం బ‌య‌ట‌కు చెప్ప‌డం లేద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తూ వ‌చ్చారు.

Image result for Nasanakota Muttyalamma devi

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వ దేవాదాయ‌శాఖ న‌ర్స‌న్న‌కోట ముత్యాల‌మ్మ ఆల‌యాన్ని స్వాధీనం చేసుకుంది. ప‌రిటాల కుటుంబ స‌భ్యుల‌తో ఏర్పాటైన ప్ర‌యివేటు కమిటీని దేవాదాయ‌శాఖ ర‌ద్దు చేసింది. దేవాదాయ‌శాఖ ఆలయానికి ఈవోను కూడా నియ‌మించింది. ప్ర‌భుత్వ‌మే త్వ‌ర‌లో పాల‌క మండ‌లిని ఏర్పాటు చేయ‌బోతుంది. 

ఆల‌యానికి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆభ‌ర‌ణాలు, విరాళాలకు సంబంధించి లెక్క‌లు చెప్పాల్సిందిగా, అకౌంట్స్‌కు సంబంధించిన పుస్త‌కాలు త‌క్ష‌ణం స్వాధీనప‌ర‌చాల్సిందిగా ఆదేశిస్తూ ఇది వ‌ర‌కు ఆల‌యాన్ని ప‌ర్య‌వేక్షించిన ప్ర‌యివేటు క‌మిటీకి దేవాదాయ‌శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ప్ర‌భుత్వం నియ‌మించిన అధికారుల విధుల‌కు ఆటంకం క‌లిగించ‌కుండా పోలీసు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను కూడా చేశారు. దీంతో ఆల‌యంపై 26 ఏళ్ల త‌రువాత ప‌రిటాల కుటుంబం ఆధిప‌త్యం తొల‌గిపోయిన‌ట్లు భావిస్తున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle