newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

ప‌య్యావుల - విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మ‌ధ్య విభ‌జ‌న ఫైట్‌..!

07-10-201907-10-2019 18:21:59 IST
2019-10-07T12:51:59.831Z07-10-2019 2019-10-07T12:51:55.782Z - - 06-12-2019

ప‌య్యావుల - విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మ‌ధ్య విభ‌జ‌న ఫైట్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచి నేటికీ ఓ గ్రామం నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. అదే పెద్ద కౌకుంట్ల‌. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఈ గ్రామం ఎమ్మెల్యే ప‌య్యావుల కేశవ్‌, వైసీపీ నేత విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మ‌ధ్య ఆధిప‌త్య పోరును మ‌రింత రాజేసింది. తాజాగా, వారి మ‌ధ్య ముదిరిన వివాదం పోలీసుల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది.

అయితే, ఏపీలో ఏ నియోజ‌క‌వ‌ర్గానికి లేని ఒక స్పెష‌ల్ ఉర‌వ‌కొండకు ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు ఎమ్మెల్యేగా గెలిచినా, గెలిచిన అభ్య‌ర్ధి పార్టీ క‌చ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఇలా ఎమ్మెల్యే ఒక పార్టీ నేత ఉంటే. రాష్ట్రంలో అధికారంలో మ‌రో పార్టీ ఉండ‌టం విశేషం. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఎవ‌రు ఉన్నా ఓడిపోయిన అభ్య‌ర్ధులతో మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు ఆధిప‌త్య‌పోరు న‌డుస్తూనే ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనిదే తాజాగా ప‌య్యావుల కేశ‌వ్, విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మ‌ధ్య జ‌రుగుతున్న వార్ కూడా.

తాజాగా, ఒక పంచాయ‌తీ విభ‌జ‌న అంశం ఇద్ద‌రి మ‌ధ్య వార్‌కు తెర లేపింది. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద కౌకుంట్ల పంచాయ‌తీ చాలా పెద్ద గ్రామ పంచాయ‌తీ పెద్ద కౌకుంట్ల ప‌రిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. అయితే ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం రెండు పంచాయ‌తీలుగా విభ‌జించాల‌ని అధికారులు అనుకున్నారు. ఇందుకోసం గ్రామ స‌భ నిర్వ‌హించాల‌ని  అధికారులు భావించారు. అయితే ఇదే వివాదానికి కార‌ణ‌మైంది.

పెద్ద కౌకుంట్ల పంచాయ‌తీ తెలుగుదేశం పార్టీకి చాలా బ‌ల‌మైన పంచాయ‌తీ. ప‌య్యావుల కేశ‌వ్ ఎమ్మెల్యేగా ఎలుపొంద‌డంలో ఈ పంచాయ‌తీ ఓట‌ర్లే కార‌కుల‌య్యార‌ని ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం చెబుతుండ‌టం విశేషం. ఈ పంచాయ‌తీలో ఇచ్చిన తీర్పే ఇక్క‌డ ఎమ్మెల్యేను డిసైడ్ చేసింది. అందుకే ఈ పంచాయ‌తీని విడ‌దీయ‌డం వ‌ల్ల గ్రామాల్లో ప‌రిస్థితులు మారుతాయ‌న్న భావ‌న‌లో టీడీపీ నేత‌లు ఉన్నారు.

అదే సంద‌ర్భంలో ఈ పంచాయ‌తీని విభజించి తీరాల్సిందేన‌ని విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. ఇన్ని రోజులు ప‌య్యావుల కేశ‌వ్ చ‌ర్య‌ల వ‌ల్ల‌నే ఇది జ‌ర‌గ‌లేద‌ని, ఇప్పుడు దీనిని కూడా అడ్డుత‌గ‌ల‌డం స‌రైన చ‌ర్య కాద‌ని విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మండిప‌డుతున్నారు. దీంతో సోమ‌వారం నాడు జ‌రిగిన గ్రామ స‌భ హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణంలో జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా, గ‌త నాలుగు రోజుల క్రితం గ్రామాల‌కు హెచ్ఎల్‌సీ నీరు విడుద‌ల చేయాలంటూ ప‌య్యావుల కేశ‌వ్, ఆయ‌న అనుచ‌రులు కాలువ‌గ‌ట్ల మీదకు వెళ్లారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి మ‌రింత‌ ఆందోళ‌న‌కు దారి తీసింది. విష‌యం తెలుసుకున్న డీఎస్పీ భారీ పోలీసు బ‌ల‌గాలతో మోహ‌రించారు.  కేశ‌వ్‌ను అడ్డుకున్నారు. 

గ్రామాల‌కు నీరు విడుద‌ల చేయ‌క‌పోతే ప‌దివేల మందితో వ‌చ్చి ఆందోళన చేస్తామ‌ని కేశ‌వ్ హెచ్చ‌రించారు. ఇలా ఒక‌ప‌క్క రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో వాగ్వాదాలు కొన‌సాగుతుంటే పెద్ద‌కౌకుంట్ల పంచాయ‌తీ వేదికగా ఇరు పార్టీల నేత‌లు వార్‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యారంటూ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో కామెంట్లు వినిపిస్తున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle