newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

ప‌ద‌వులు ఉంటేనే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారా నారాయ‌ణా..?

24-10-201924-10-2019 11:31:21 IST
Updated On 24-10-2019 12:56:52 ISTUpdated On 24-10-20192019-10-24T06:01:21.961Z24-10-2019 2019-10-24T06:01:19.954Z - 2019-10-24T07:26:52.601Z - 24-10-2019

ప‌ద‌వులు ఉంటేనే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారా నారాయ‌ణా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి నారాయ‌ణ కొంత కాలంగా నెల్లూరు జిల్లాతో స‌హా రాష్ట్ర రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయ‌న ఇక అప్ప‌ట్నుంచి పొలిటిక‌ల్‌గా సైలెంట్ అయ్యారు. దాంతో మాజీ మంత్రి నారాయ‌ణ ఎక్క‌డ‌..? ప్ర‌జా వేదిక కూల్చివేత టైమ్‌లో క‌నిపించ‌లేదు. రాజ‌ధాని ర‌చ్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో బ‌య‌ట‌కు రాలేదు. ఇంత‌కీ నారాయ‌ణ ఎక్క‌డున్నారు. ఏం చేస్తున్నారు..? అన్న ప్ర‌శ్న‌లు రాజకీయంగా చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయి.  

నెల్లూరు జిల్లాలో మొత్తం ప‌ది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్‌స‌భ వైసీపీ గెలిచింది. దీంతో జిల్లాలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నిక‌ల‌కు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్న‌ట్లు నారాయ‌ణ వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత అస‌లు కంటికి క‌నిపించ‌కుండా మాయ‌మైపోయారు. ఎవ్వ‌రికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయ‌న ఏం చేస్తున్నార‌న్న హాట్ డిస్క‌ర్ష‌న్ నడుస్తుంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత మాజీ మంత్రి నారాయ‌ణ పూర్తిగా టీడీపీ నేత‌ల‌ను దూరం పెట్టారు. త‌న ప‌క్క‌నే ఉంటూ త‌న‌కిందే గోతులు తీశార‌న్న అనుమానం ఓ వైపు, మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన బాధ మ‌రోవైపు నారాయ‌ణ‌కు దిక్కు తోచ‌కుండా చేశాయి. దీంతో ఆయ‌న దాదాపుగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటార‌ని నెల్లూరు జిల్లాలో ప్ర‌చారం జ‌రిగింది.

ఇటీవ‌ల నెల్లూరు జిల్లాకు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్పుడు నారాయ‌ణ వ‌చ్చారు. రెండు రోజుల‌పాటు పార్టీ స‌మావేశంలో పాల్గొన్నారు. కానీ, మ‌ళ్లీ మాయ‌మైపోయారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న పార్టీ కార్య‌క్ర‌మాల్లో మాత్రం పాల్గొన‌డం లేదు. ఆ మ‌ధ్య చంద్ర‌బాబు కోట‌రీలో కీల‌క నేత‌లు బీజేపీలో చేర‌డంతో నారాయ‌ణ కూడా క‌మ‌లంవైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అధికార పార్టీలోకి జంప్ అవుతార‌ని మ‌రోవార్త వినిపించింది. కానీ నారాయ‌ణ మాత్రం సైలెంట్‌గా త‌న విద్యా సంస్థ ప‌నులు చూసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

అక్క‌డ కొత్త కొత్త టార్గెట్‌లు పెట్టి విద్యా సంస్థ‌ల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కైతే నారాయ‌ణ తెర‌వెనుక ఉండే మంత్రాగం న‌డుపుతున్నారు. అస‌లు త‌న ఉనికి ఎక్క‌డ ఉందో..? ఎవ్వ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. 

 

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle