newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

ప‌క్షుల‌నూ వ‌ద‌ల‌ని వైసీపీ రంగులు..!

04-01-202004-01-2020 11:06:23 IST
Updated On 04-01-2020 12:13:18 ISTUpdated On 04-01-20202020-01-04T05:36:23.632Z04-01-2020 2020-01-04T05:36:19.828Z - 2020-01-04T06:43:18.762Z - 04-01-2020

ప‌క్షుల‌నూ వ‌ద‌ల‌ని వైసీపీ రంగులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా, రొట్టెల పండుగ‌, ఫ్లెమింగో ఫెస్టివ‌ల్‌కు ఎంతో ప్రసిద్ధి. అటువంటిది ఈ రోజు నుంచి సూళ్లూరుపేట హైస్కూల్ వేదిక‌గా మొద‌లు కానున్న ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. ఈ కార్య‌క్రమం నిర్వ‌హ‌ణ‌కు వ‌రుణుడు సైతం అడ్డంకిగా మారాడు. హైస్కూల్ గ్రౌండ్ మొత్తం వ‌ర్ష‌పు నీటితో నిండింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వ‌ర్ష‌పు నీటిని తోడి, బుర‌ద‌మ‌యంగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఇసుక‌తో క‌ప్పేశారు.

అలాగే, ఈ ఫెస్టివ‌ల్ స్టాల్స్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాల్సిన ప్ర‌భుత్వ శాఖ‌ల వ‌స్తువులను చివ‌రి రోజైన‌ శుక్ర‌వారం వ‌ర‌కు ఏర్పాటు చేయ‌క పోవ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మూడు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ గ‌త చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్వ‌హ‌ణ‌కు భిన్నంగా ఉంటుంద‌ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య ఇటీవ‌ల మీడియాతో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే, నేటి నుంచి ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ ఏర్పాట్ల‌ను చూసిన వారంతా నోరెళ్ల‌బెడుతున్నారు. ఫెస్టివ‌ల్ ఏర్పాట్లు చేసిన హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగ‌ణాన్ని మొత్తం వైసీపీ పార్టీ రంగుల‌తో నింపేశారు. దీనిపై టీడీపీ నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌పై. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు భిన్నంగా భ‌లే ఏర్పాట్లు చేశారే అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకున్న జ‌గ‌న్ స‌ర్కార్, గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఆకర్షించేందుకు ప్ర‌భుత్వ హైస్కూల్ అని కూడా చూడ‌కుండా వైసీపీ పార్టీ జెండా రంగుల‌తో నింపేశారన్న టాక్ విన‌వ‌స్తుంది. మ‌రోప‌క్క‌, ఈ ఫ్లెమింగో ఫెస్టివ‌ల్‌లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలను నిర్వహించేందుకు ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంత్రులు బాలినేని, అనీల్‌కుమార్ యాదవ్, రామ‌చంద్రారెడ్డి త‌దిత‌రులు ఈ ఫెస్టివ‌ల్‌లో పాల్గొన‌నున్నారు. ఈ కార్య‌క్రమానికి సినీ గ్లామ‌ర్‌ను కూడా అద్ద‌నున్నారు.

ఇటీవ‌ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వైసీపీ రంగులు పుల‌మ‌డంతో ఆ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఒకానొక స‌మ‌యంలో క‌ల‌గ‌జేసుకున్న హైకోర్టు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ జెండా రంగులు వేయొద్దంటూ హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ వేదిక అయిన సూళ్లూరుపేట ప్ర‌భుత్వ హైస్కూల్ ప్రాంగ‌ణంలో ఇప్పుడు వైసీపీ రంగులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రి, ఈ రంగుల‌పై ఎవ‌రెవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle