newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ప్ర‌భుత్వ ఉద్యోగికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు..?

05-10-201905-10-2019 16:06:51 IST
2019-10-05T10:36:51.634Z05-10-2019 2019-10-05T10:36:24.183Z - - 08-12-2019

ప్ర‌భుత్వ ఉద్యోగికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిపై వెంక‌టాచ‌లం ఎంపీడీవో సర‌ళ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. గొల‌గ‌మూడి ద‌గ్గ‌ర ఉన్న ఒక వెంచ‌ర్ విష‌యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధర్‌రెడ్డి బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు ఎంపీడీవో తెలిపారు. అయితే, అర్ధ‌రాత్రి ఎంపీడీఓ స‌ర‌ళ ఇంటికి వెళ్లిన కోటంరెడ్డి వెంచ‌ర్‌కు నీటి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరిన‌ట్టుగా తెలుస్తుంది.

వెంచ‌ర్‌కు నీరు అందించే అంశం త‌మ ప‌రిధిలో లేద‌ని చెప్పినా కోటంరెడ్డి బెదిరించార‌ని ఎంపీడీఓ ఆరోపించారు. ఇంటికి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డ‌మే కాకుండా నీటి పైపులైన్‌ను కూడా ధ్వంసం చేశార‌ని ఎంపీడీఓ స‌ర‌ళ ఆవేన‌ద వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి నుంచి త‌మ కుటుంబానికి ప్రాణహాని ఉంద‌ని, త‌న‌కు ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని ఎంపీడీఓ స‌ర‌ళ అన్నారు.

ఎంపీడీఓ స‌ర‌ళ మీడియాతో మాట్లాడుతూ వెంక‌టాచ‌లం మండ‌లం అనికెప‌ల్లి గ్రామ పంచాయ‌తీ గొల‌గ‌మూడి అనే గ్రామంలో లే అవుట్ వేసి ఉన్నారు. అది నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేకు సంబంధించిన  కృష్ణారెడ్డి అనే వ్య‌క్తికి చెందిన‌ది. ఆ లే అవుట్‌కు పంచాయ‌తీ నుంచి వాట‌ర్ క‌నెక్ష‌న్ ఇవ్వాల‌ని అడిగారు. మొద‌ట‌గా కృష్ణారెడ్డి త‌రుపు బిర‌ద‌వోలు శ్రీ‌కాంత్‌రెడ్డి ఫోన్ చేసి నీటి క‌నెక్ష‌న్ ఇవ్వాల‌ని చెప్పారు.

అయితే, చ‌ట్ట నిబంధ‌న‌ల ప్ర‌కారం లే అవుట్స్‌కు పంచాయ‌తీ నుంచి వాట‌ర్ క‌నెక్ష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. వెంచ‌ర్స్ వారే నీటి క‌నెక్ష‌న్స్ ఏర్పాటు చేసుకోవాలి. అక్టోబ‌ర్ 1వ తేదీ సాయంత్రం 8.30 స‌మ‌యంలో కోటoరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నుంచి ఫోన్ వ‌చ్చింది. ఆ ఫోన్‌ను రిసీవ్ చేసుకోగా కోటంరెడ్డి బాగా కోపంతో రేపు సాయంత్రంలోగా చేయి, చేయ‌కుంటే నీ అంతు చూస్తానంటూ మాట్లాడార‌ని ఎంపీడీఓ స‌ర‌ళ మీడియాతో చెప్పుకొచ్చింది.

మ‌రోపక్క‌, వెంచ‌ర్ విష‌యంలో ఎంపీడీవో స‌ర‌ళ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఖండించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నుడా, రెరా రెండు సంస్థ‌ల అనుమ‌తులు ఉన్న ఏకైక లే అవుట్ గొల‌గ‌మూడిలోని కృష్ణారెడ్డికి చెందిన లే అవుట్ మాత్ర‌మే. ఆ లే అవుట్ స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది.

ఆ లే అవుట్ నిర్మాణానికి అధికారిక అనుమ‌తులు ఇచ్చి కూడా చాలాకాల‌మైంది. వాట‌ర్ క‌నెక్ష‌న్ కోసం మూడు నెల‌లుగా ఇబ్బంది పెడుతున్నార‌న్నారు. ఈ క్ర‌మంలో ఎంపీడీఓ స‌ర‌ళ‌కు ఫోన్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి తెలిపారు. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఇవ్వొద్ద‌ని చెప్పారంటూ ఎంపీడీవో స‌మాధానం చెప్పిందన్నారు.

ఇదే విష‌య‌మై కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డితో మాట్లాడితే దాంట్లో వేరే ఉందిలే.. నీతో మ‌ళ్లీ మాట్లాడుతానులేనంటూ చెప్పుకొచ్చార‌ని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. అంతేత‌ప్ప‌, ఎంపీడీవో స‌ర‌ళ ఇంటికి వెళ్లి దౌర్జ‌న్యం చేశానంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై తాను బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle