ప్రతిపక్ష హోదా గల్లంతేనా..! జగన్ వ్యూహం మార్చారా..?
04-12-201904-12-2019 14:52:50 IST
2019-12-04T09:22:50.391Z04-12-2019 2019-12-04T09:22:47.581Z - - 06-12-2019

తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేలా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో దారుణ ఓటమి, రోజురోజుకూ నేతలు పార్టీ వీడుతుండటంతో బలహీనపడుతున్న టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు మంతనాలు చేస్తోంది.
ఐదారుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయవచ్చని తనకు కొందరు సూచించినట్లు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలోనే చెప్పారు. కానీ, తాను ఆ పని చేయనని జగన్ అప్పుడు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఆయన మనస్సు మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. తనకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోలేకుండా చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
తన పార్టీని బలహీనపరిచేందుకు చంద్రబాబు గతంలో వెళ్లిన దారిలోనే జగన్ వెళుతున్నారు. చంద్రబాబు నేరుగా వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పేశారు. జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వెళుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా పార్టీలోకి చేర్చుకోకుండా ప్రస్తుతానికి టీడీపీకి దూరం చేస్తున్నారు. తనకు మద్దతు ప్రకటించేలా చేస్తున్నారు. వల్లభనేని వంశీ విషయంలో వైసీపీ ఇదే స్ట్రాటజీ అమలు చేసింది.
ఇప్పుడు టీడీపీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వంశీ బాటలో జగన్‌కు జిందాబాద్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురితో మంత్రులు మంతనాలు సాగించారు.
వీరు అనుచరులతో సమావేశాలు పెట్టుకొని నేడో, రేపో జగన్‌ను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్‌తో భేటీ అనంతరం జగన్‌కు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.
గొట్టిపాటి రవి పేరు ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల ఆయన క్వారీలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు ఈ దాడులు జరిగాయి.
వ్యాపారానికి ఇబ్బంది ఉండొద్దంటే వైసీపీలో చేరాలనే ఆలోచన గొట్టిపాటిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
పర్చూరులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలాగూ వైసీపీకి దూరమయ్యారు. దీంతో సాంబశివరావు వైసీపీలోకి వస్తే ఆయనకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పేరు కూడా పార్టీ మారే లిస్టులో వినిపిస్తోంది. కానీ, ఆయనకు గొట్టిపాటి రవితో పడదు. కాబట్టి గొట్టిపాటి వైసీపీలో చేరితే కరణం బలరాం చేరకపోవచ్చు.
మరోవైపు కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. పార్టీ మారవద్దని వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది.
అయితే, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తెచ్చే బాధ్యతను మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
2 minutes ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
17 minutes ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
32 minutes ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
an hour ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
3 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
3 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
18 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం
19 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
19 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
20 hours ago
ఇంకా