newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ప్ర‌తిప‌క్ష హోదాకు ఎస‌రు పెట్టారా..?

11-12-201911-12-2019 09:17:43 IST
2019-12-11T03:47:43.581Z11-12-2019 2019-12-11T03:45:58.671Z - - 11-08-2020

ప్ర‌తిప‌క్ష హోదాకు ఎస‌రు పెట్టారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఒక దారి దొరికింది. అసెంబ్లీలో ఆయ‌న‌ను ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తించేందుకు స్పీక‌ర్ సానుకూలంగా ఉన్నారు. దీంతో వంశీపై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశాలు ఇంచుమించు లేవు. ఈ నేప‌థ్యంలో వంశీ బాట‌లో మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు న‌డ‌వ‌నున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసి, తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ. అయితే, ఆయ‌న అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేర‌లేదు.

ప్ర‌స్తుతం చ‌ట్టాల్లో ఉన్న లోపాల కార‌ణంగా అధికారికంగా వేరే పార్టీలోకి ఫిరాయించినా అన‌ర్హ‌త వేటు ప‌డ‌టం లేదు. గ‌త అసెంబ్లీలో 23 మంది వైసీపీ స‌భ్యులు టీడీపీ కండువాలు క‌ప్పుకున్నా, న‌లుగురు మంత్రులు అయినా వారిపై వేటు వేయ‌కుండా కాపాడింది అప్ప‌టి టీడీపీ స‌ర్కార్‌.

ఇప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేల‌ను వైసీపీలో చేర్చుకుంటే అన‌ర్హ‌త వేటు వేయ‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకోగ‌ల‌దు. ఇది స్పీక‌ర్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ, ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన వారు త‌మ పార్టీలో చేరాలంటే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక‌టికి రెండు సార్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు వంశీకో, మ‌రొక‌రిరో వైసీపీ కండువా క‌ప్పితే ఆయ‌న మాట త‌ప్పిన‌ట్లు అవుతుంది.

ఎమ్మెల్యేలు గెలిచి కేవ‌లం ఆరు నెల‌లు మాత్ర‌మే అవుతుంది. కాబ‌ట్టి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ సిద్ధ‌ప‌డే అవ‌కాశం లేదు. మ‌రోవైపు తెలుగుదేశం పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోకుండా చేయాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. గ‌త అసెంబ్లీలో త‌న ప్ర‌తిప‌క్ష నేత హోదాను పోగొట్టేందుకు చంద్ర‌బాబు విఫ‌ల‌య‌త్నం చేశారు.

ఇప్పుడు జ‌గ‌న్ ఇదే ఆలోచ‌న చేస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్ష హోదాను పోగొట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఇప్ప‌టికే వంశీ టీడీపీకి దూర‌మైనందున మ‌రో ఐదుగురు టీడీపీ స‌భ్యులు కూడా బ‌య‌టకు వ‌చ్చేస్తే టీడీపీకి అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా గ‌ల్లంతు కావ‌డం ఖాయం. ఇప్ప‌టికే మ‌రికొంత మంది తెలుగుదేశం స‌భ్యుల‌తో వైసీపీ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస‌రావు, గొట్టిపాటి ర‌వి, సాంబ‌శివ‌రావు, గ‌ణ‌బాబు, వాసుప‌ల్లి గ‌ణేష్‌, క‌ర‌ణం బ‌ల‌రాం వంటి వారితో వైసీపీ ట‌చ్‌లో ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

వీరిలో కొంద‌రు ఈ ప్ర‌చారాన్ని ఖండిస్తున్నా మ‌రికొందరు మాత్రం గ‌ట్టిగా ఖండించ‌డం లేదు. దీంతో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇక, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ పేరు కూడా వినిపిస్తోంది.

ఆయ‌న జ‌న‌సేన‌లోనే ఉంటాన‌ని చెబుతున్నా సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్‌పై ఆప్యాయ‌త చూపిస్తున్నారు. ఇటీవ‌ల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ ఎమ్మెల్యేల కంటే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా మెలిగారు.

అంత‌కుముందు జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం కూడా చేశారు. దీంతో ఆయ‌న కూడా జ‌న‌సేన‌కు దూర‌మ‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇలా టీడీపీ, జ‌న‌సేన‌కు దూర‌మ‌య్యే వారంతా అధికారికంగా వైసీపీలో చేర‌కుండా ప్ర‌త్యేక గ్రూప్‌గా మారే అవ‌కాశం ఉంది. త‌న‌ను ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తించాల‌ని వంశీ విన‌తికి స్పీక‌ర్ సానుకూల‌త వ్య‌క్తం చేశారు.

దీంతో వంశీ బాట‌లోనే వీరు కూడా ప్ర‌త్యేక స‌భ్యులుగా అసెంబ్లీలో కూర్చుంటార‌ని తెలుస్తోంది. ఇదే, జ‌రిగితే తెలుగుదేశం పార్టీ ప్ర‌తిప‌క్ష హోదాకు ఎస‌రు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   4 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   5 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle