newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ప్ర‌జాక్షేత్రంలో ఓడినా కోర్టులో గెలుస్తారంట‌..!

09-07-201909-07-2019 07:38:11 IST
Updated On 09-07-2019 11:21:57 ISTUpdated On 09-07-20192019-07-09T02:08:11.222Z09-07-2019 2019-07-09T02:07:22.294Z - 2019-07-09T05:51:57.815Z - 09-07-2019

ప్ర‌జాక్షేత్రంలో ఓడినా కోర్టులో గెలుస్తారంట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌మి స‌హ‌జం. సాధార‌ణంగా ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఓడిన వారంద‌రి నోటి నుంచి వ‌చ్చే కామ‌న్ డైలాగ్ ఇది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేత‌లు మాత్రం ఈ డైలాగ్ చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. ప్ర‌జ‌ల్లో ఓడినా కోర్టుల్లో గెలుస్తామంటున్నారు. గెలిచిన వారి అఫిడ‌విట్ల‌లో రంధ్రాన్వేష‌ణ చేసి కోర్టు గ‌డ‌ప తొక్కుతున్నారు.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. జ‌గ‌న్ హ‌వాతో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన 151 మంది సునాయ‌సంగా విజ‌యం సాధించారు. గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నుకున్న వారు సైతం వైసీపీ జెండా ప‌ట్టుకొని గ‌ట్టెక్కారు. కానీ, గెలుస్తార‌నుకున్న నేత‌లు మాత్రం ఓడిపోయారు. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి నెల‌న్న‌ర గ‌డుస్తున్నా ఇంకా ఓట‌మిని స‌ద‌రు అభ్య‌ర్థులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పెద్దాపురం నియోజ‌క‌ర్గంలో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన చిన‌రాజప్ప‌పై వైసీపీ త‌ర‌పున మాజీ ఎంపీ తోట న‌ర‌సింహం స‌తీమ‌ణి తోట వాణి పోటీ చేశారు. చిన‌రాజ‌ప్ప‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన ఆమె 4 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. 

చిన‌రాజ‌ప్ప ఐదేళ్ల పాటు కీల‌కశాఖ‌కు మంత్రిగా ప‌నిచేయ‌డం, నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డం, వాణి నాన్ లోక‌ల్ కావ‌డంతో ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే, ఇంకా ఓట‌మిని జీర్ణించుకోలేని వాణి ఇప్పుడు కోర్టు ద్వారా అయినా గెల‌వాల‌ని భావిస్తున్నారు.

చిన‌రాజ‌ప్ప అఫిడ‌విట్ల‌లో కొన్ని త‌ప్పులున్నాయ‌నేది ఆమె వాద‌న‌. ఆదాయ వ‌న‌రులు, కోర్టు కేసులు ఆయ‌న ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో దాచి పెట్టార‌ని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్ర‌యించారు. చిన‌రాజ‌ప్ప ఎన్నిక చెల్ల‌ద‌ని, కాబ‌ట్టి త‌న‌కే ఎమ్మెల్యేగా అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆమె ఆశ‌.

ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా హాట్ సీట్ల‌లో ఒక‌టి ప్ర‌కాశం జిల్లా చీరాల‌. ఇక్క‌డి టీడీపీ నుంచి వైసీపీలో చేరి చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శించిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పోటీ చేశారు.

త‌న‌ను టార్గెట్ చేసిన కృష్ణ‌మోహ‌న్ క‌చ్చితంగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు అద్దంకి నుంచి సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాంను తీసుకువ‌చ్చి చీరాల‌లో పోటీ చేయించారు. విజ‌యంపై ధీమాగా ఉన్న కృష్ణ‌మోహ‌న్‌కు ఫ‌లితాలు షాక్ ఇచ్చాయి. కృష్ణ‌మోహ‌న్‌పై క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు.

దీంతో ఇప్పుడు కోర్టు ద్వారా అయినా తాను ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని కృష్ణ‌మోహ‌న్ భావిస్తున్నారు. క‌ర‌ణం బ‌ల‌రాం సంతానం విష‌యంలో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, ఆయ‌న ఆధారాల‌తో స‌హా కోర్టును ఆశ్ర‌యించారు.

దీంతో ఆయ‌న బ‌ల‌రాం ఎన్నిక చెల్ల‌ద‌ని ధీమాగా ఉన్నారు. ఇక‌, ఇలానే టీడీపీ నుంచి విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమ కూడా మ‌ల్లాది విష్ణు ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. కానీ, ఆయ‌న పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది.

అయినా, తోట వాణి, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు మాత్రం ఇంకా ఆశ‌లు ఉన్నాయి. గ‌త అసెంబ్లీలోనూ ఇటువంటి కేసు వ‌చ్చింది. అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన ఈర‌న్న అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని వైసీపీ అభ్య‌ర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈర‌న్న ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు ఇవ్వ‌గా టీడీపీ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. 

ఈ త‌తంగం అంతా నాలుగేళ్లు న‌డిచింది. చివ‌ర‌కు మ‌రో నాలుగు నెలల్లో ఎన్నిక‌లు ఉన్నాయ‌న‌గా సుప్రీం కోర్టు సైతం ఈర‌న్న ఎన్నిక చెల్ల‌ద‌ని తీర్పు ఇవ్వ‌డంతో నాలుగు నెల‌ల కోసం తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు.

ఇప్పుడు తోట వాణి, కృష్ణ‌మోహ‌న్ కూడా కోర్టును ఆశ్ర‌యించినా తీర్పులు వ‌చ్చే వ‌ర‌కు ఎంత‌కాలం ప‌డుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ, వీరి మాత్రం తాము క‌చ్చితంగా కోర్టులో గెలుస్తామ‌ని ధీమాగా ఉన్నారు. ఇదే జ‌రిగితే టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లోనూ కోత ప‌డే అవ‌కాశం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle