newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ప్ర‌కాశం ఎవ‌రి వ‌శం-2

29-04-201929-04-2019 07:33:31 IST
Updated On 30-04-2019 16:25:07 ISTUpdated On 30-04-20192019-04-29T02:03:31.072Z29-04-2019 2019-04-29T02:03:25.526Z - 2019-04-30T10:55:07.081Z - 30-04-2019

ప్ర‌కాశం ఎవ‌రి వ‌శం-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

ఎస్సీ రిజ‌ర్వుడ్ స్థాన‌మైన సంత‌నూత‌ల‌పాడులో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఆదిమూలం సురేష్ గెలిచారు. ఈసారి ఆయ‌న య‌ర్ర‌గొండపాలెం వెళ్ళడంతో టీజేఆర్ సుధాక‌ర్ బాబును వైసీపీ బ‌రిలో నిలిపింది. సుధాక‌ర్ బాబు స్థానికేత‌రుడు కావ‌డం మైన‌స్ గా మారింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విజ‌య్ కుమార్ పోటీ చేశారు.  గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి ఆయ‌న‌పై ఉంది. ఈసారి ఇక్క‌డ హోరాహోరీ పోరు జ‌రిగిన మొగ్గు టీడీపీ వైపే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఒంగోలులో వ‌రుస‌గా నాలుగుసార్లు గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడారు. ఆయ‌న‌పై దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ టీడీపీ నుంచి 12 వేల ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఈసారి కూడా మ‌ళ్లీ వీరిద్ద‌రే త‌ల‌ప‌డ్డారు. ఇక్క‌డ డ‌బ్బు ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించింది.

టీడీపీ అభ్య‌ర్థి జ‌నార్ధ‌న్ వైపు ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ మొగ్గు క‌నిపించినా చివ‌ర్లో బాలినేనికి విజ‌యావ‌కాశాలు మెరుగ‌య్యాయి. ఇక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హించిన జ‌గ‌న్‌.. బాలినేనిని గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని కూడా హామీ ఇవ్వ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చింది. ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీయే వ‌చ్చే అవ‌కాశం ఉంది.

కందుకూరులో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోతుల రామారావు గెలిచినా త‌ర్వాత టీడీపీలో చేరి ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీకి స‌రైన అభ్య‌ర్థి లేరు. మాజీ మంత్రి మ‌నుగుంట మ‌హిధ‌ర్ రెడ్డి చేరిక‌తో వైసీపీకి బ‌లం చేకూరింది. ఇక్క‌డ మూడుసార్లు గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేసిన మ‌హిధ‌ర్ రెడ్డికి గ‌ట్టి ప‌ట్టుంది. దీంతో పోతుల టీడీపీ నుంచి మ‌ళ్లీ గెలుస్తార‌ని అనుకున్నా చివ‌ర‌కు ట‌ఫ్ ఫైట్ ఏర్ప‌డింది. టీడీపీ కంటే వైసీపీకి విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

మ‌రో ఎస్సీ రిజ‌ర్వుడ్ స్థాన‌మైన కొండ‌పిలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి బాల‌వీరాంజ‌నేయ స్వామి విజ‌యం సాధించారు. వైసీపీ నుంచి జూపూడి పోటీ చేసి ఓడారు. అయితే, వైసీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన స‌మ‌న్వ‌య‌క‌ర్త దొర‌క‌క‌పోవ‌డంతో వెనుక‌బ‌డింది. చివ‌ర‌గా డాక్ట‌ర్ వెంక‌య్య‌ను తీసుకువ‌చ్చి పోటీ చేయించారు. ఆయ‌న రాజ‌కీయాల‌కు కొత్త‌. అప్ప‌టికే ఉన్న నేత‌లు ఆయ‌న‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌లేదు. టీడీపీలోనూ స్వామికి ఓ వ‌ర్గం నేత‌లు స‌హ‌క‌రించ‌కున్నా ఆ పార్టీ ఇక్క‌డ బ‌లంగా ఉంది. టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉండే ఓ సామాజ‌క‌వ‌ర్గం జ‌నాభా ఇక్క‌డ ఎక్కువ. మొత్తంగా టీడీపీ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

మార్కాపురంలో ఈసారి టీడీపీ, వైసీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి జంకె వెంక‌ట్ రెడ్డి సుమారు 10 వేల మెజారిటీతో గెలిచారు. ఈసారి నాగార్జున‌రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ‌రెడ్డి పోటీ చేశారు. ఈసారి ఇద్ద‌రి మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎవ‌రు గెలిచినా త‌క్కువ మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

జిల్లాలో ఎక్కువ పోటీ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గిద్ద‌లూరు ఒక‌టి. ఇక్క‌డి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ముత్త‌ముల అశోక్ రెడ్డి గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన అన్నా రాంబాబు ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేశారు. దీంతో ఇద్ద‌రూ పాత ప్ర‌త్య‌ర్థులే. దీంతో హోరాహోరీ పోరు జ‌రిగింది. పార్టీ ఫిరాయించిన అశోక్ రెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త క‌నిపించింది. అన్నా రాంబాబుకు మాస్ ఇమేజ్ ఉంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ కు విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

క‌నిగిరిలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి క‌దిరి బాబూరావు గెలిచారు. ఈసారి ఆయ‌న‌ను కాకుండా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డిని నిలిపారు. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మ‌ధుసుద‌న్ యాద‌వ్ కు మ‌ళ్లీ టిక్కెట్ ఇచ్చారు. బీసీ ఓట్లు ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది. రెడ్డి సామాజ‌క‌వ‌ర్గ ఓట్లు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తాయి. టీడీపీ అభ్య‌ర్థి అదే సామాజ‌క‌వ‌ర్గం నేత కావ‌డంతో ఆయ‌న గెలుపుపై ధీమాగా ఉన్నారు. వైసీపీ అభ్య‌ర్థి మ‌ధుసూద‌న్ యాద‌వ్‌పై సానుభూతి ఉంది. మొత్తంగా ఈసారి వైసీపీకి ఇక్క‌డ విజ‌యావ‌కాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

అద్దంకిలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి ర‌వి ఈసారి టీడీపీలో చేరారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. ఈసారి టీడీపీ నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సీనియ‌ర్ నేత‌, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన బాచిన చెంచు గ‌ర‌ట‌య్య పోటీ చేశారు. ఒకే పార్టీలో ఉన్నా క‌ర‌ణం వ‌ర్గం టీడీపీ అభ్య‌ర్థి గొట్టిపాటికి పూర్తిగా స‌హ‌క‌రించ‌లేదు. చెంచు గ‌ర‌ట‌య్య ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చ‌నా గొట్టిపాటి ర‌వి కుమార్ కు గెలిచే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీనే వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మొత్తంగా 12 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న ప్ర‌కాశంలో హోరాహోరీ పోటీ జ‌రిగింది. ఏ పార్టీకీ ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం లేదు. రెండు పార్టీల‌కూ స‌మానంగా సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, పోలింగ్ స‌ర‌ళిని విశ్లేషిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. అదే జ‌రిగితే ట‌ఫ్ ఫైట్ ఉన్న స్థానాల‌ను సైతం వైసీపీ గెలుచుకొని జిల్లాపై ఆధిప‌త్యం చూపే అవ‌కాశం ఉంది. 

ప్ర‌కాశం ఎవ‌రి వ‌శం-1 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://www.newssting.in/p/5cc65a967a710d0759a8c5d0


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle