newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

11-07-202011-07-2020 13:05:32 IST
2020-07-11T07:35:32.274Z11-07-2020 2020-07-11T07:33:19.219Z - - 08-08-2020

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు, అన్ ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యాలకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీర భద్రుడు కీలక ఆదేశాలు జారీచేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డి ఈ ఓ లు ప్రత్యేక నిబంధనల అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రైవేట్  అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని, విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు ఇవ్వకూడదని సూచించారు. 

ఇదిలా ఉంటే ఎన్ సీఈఆర్ టీ ప్రత్యామ్నాయ విద్య సంవత్సర క్యాలెండర్ ను సిద్దం చేసింది. ఈ విద్యా సంవత్సరం క్యాలండర్ ను పాటించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చారు. ఆన్ లైన్ అభ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో అమలవుతున్న విధానాలపై నిఘా పెట్టనున్నారు. 

ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించి ఫీజులు చెల్లించమంటున్నారని  ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలలు విద్యార్థులకు టెస్ట్ లు పెట్టి మార్కులు, ర్యాంకులు ఇస్తున్నారని తమ  దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలో ఇంకా అకడమిక్ క్యాలెండర్ తయారుకాలేదన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చినవీరభద్రుడు.

పాఠశాలల పనిదినాలు, సిలబస్ తగ్గింపు ద్వారా విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎన్ సి ఈ ఆర్ టి ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను అన్ని స్థాయి విద్యార్థులకు తయారు చేస్తోందని, టీచర్లు, సోషల్ మీడియా సాయం తో అకడమిక్ విద్యను పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థులకు అందించాలన్నారు. ఇప్పుడు ఎన్ సి ఈ ఆర్ టి 8రకాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ ను ప్రాథమిక విద్య కోసం విడుదల చేసింది.

 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ముందడుగు

   8 hours ago


 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   14 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   15 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   16 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   17 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   18 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   18 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   18 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   19 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle