newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ప్రియాంకా రెడ్డి హత్య హేయమయిన చర్య..పవన్ ఆవేదన

30-11-201930-11-2019 12:34:54 IST
2019-11-30T07:04:54.469Z30-11-2019 2019-11-30T07:04:52.788Z - - 05-08-2020

ప్రియాంకా రెడ్డి హత్య హేయమయిన చర్య..పవన్ ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో శంషాబాద్ దగ్గర జరిగిన డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, వివిధ రాజకీయపార్టీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. డాక్టర్ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమైపోయిందని అన్నారు. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. 

శంషాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోట మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పవన్ అన్నారు. చిత్తూరు జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుర్మార్గుడు నాశనం చేశాడన్నారు. వరంగల్‌లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు.. నిర్భయ చట్టం తెచ్చినా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేధింపులకు పాల్పడేవారికి భయం లేదు.

ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు ఉండాలన్నారు పవన్.  పోలీసు శాఖ సైతం షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలని, శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలన్నారు. యువతులు, విద్యార్ధినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని సూచించారు. 

No photo description available.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle