newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ప్రాణం తీసిన శానిటైజర్...మద్యం దొరక్క 9మంది బలి

31-07-202031-07-2020 11:56:29 IST
Updated On 31-07-2020 11:57:59 ISTUpdated On 31-07-20202020-07-31T06:26:29.937Z31-07-2020 2020-07-31T06:26:21.500Z - 2020-07-31T06:27:59.740Z - 31-07-2020

ప్రాణం తీసిన శానిటైజర్...మద్యం దొరక్క 9మంది బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ఉపయోగించే శానిటైజర్లు కొందరి పాలిట శాపాలుగా మారుతున్నాయి. శానిటైజర్ల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే... మద్యం దొరక్క శానిటైజర్ తాగేసి కొందరు మరణిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కురిచేడు మండలంలో శానిటైజర్‌ తాగి కొందరు వెంటనే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరణించారు. 9మంది మరణించడం గ్రామాల్లో విషాదానికి కారణమయింది. 

కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలు లేకపోవడంతో కొంతమంది స్థానికులు, యాచకులు శానిటైజర్‌ తాగారు. స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉండే ఇద్దరు యాచకులు మద్యం దొరక్క  శానిటైజర్లు తాగుతున్నారు. గురువారం రాత్రి కడుపులో మంటగా ఉందని ఓ వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే మరణించాడు.మరో వ్యక్తిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా 108కి సమాచారం ఇచ్చారు.

వీరిని దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీస్ స్టేషన్ సమీపంలో వుండే యువకుడు రమణయ్య శానిటైజర్, నాటుసారా కలిపి తాగినట్టు తెలుస్తోంది. అయితే అతన్ని వారించినా పట్టించుకోలేదు. శానిటైజర్ తాగి ఇంటికెళ్లి అపస్మారక స్థితికి చేరాడు. 108 వచ్చి అతడిని పరీక్షించారు. అప్పటికే అతను మరణించినట్టు ధృవీకరించారు. 

ఇవాళ ఉదయం ఆరుగురు చనిపోయారు. మృతుల్లో అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60) ,  కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65) బాబు (40), ఛార్లెస్ (45), అగస్టీన్ (47) మరణించారు,. వీరంతా మందుకి బానిసై రోజు శానిటైజర్  తాగుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ శానిటైజర్లో ఏమైనా కలిపి తాగారా?ఈ శానిటైజర్లలో ఏముందనేది తేలాల్చి వుంది. శానిటైజర్లతో ప్రమాదాల గురించి అవగాహన కల్పించాల్సి వుంది. 

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   15 minutes ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   an hour ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   14 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   14 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   17 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   19 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

   a day ago


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle