newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ప్రభుత్వ భవనాల అద్దెల్లో భారీకుంభకోణం..

10-10-201910-10-2019 12:01:49 IST
2019-10-10T06:31:49.963Z10-10-2019 2019-10-10T06:31:45.664Z - - 09-12-2019

 ప్రభుత్వ భవనాల అద్దెల్లో భారీకుంభకోణం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ భవనాలకు అద్దెల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్బడిన విషయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వేల రూపాయలనుంచి కోటి రూపాయల వరకు కొనసాగిన ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం సీరియస్‌గా దీనిపై దృష్టి పెట్టింది. బయటపడిన వివరాల మేరకు టీడీపీ ప్రభుత్వంలో కొందరు కీలక నేతలు అనేక ప్రయివేట్ భవనాలను కొన్ని వేల రూపాయలనుంచి కోటి రూపాయల వరకు లీజుకు తీసుకుని వాటినే ఇంకా అధిక అద్దెలకు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి డబ్బులు దండుకున్నారని తెలుస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషించిన పెద్దమనిషితో సహా 200 మంది వ్యక్తులు ఇలాంటి భవనాలకు ప్రభుత్వం నుంచి భారీ అద్దెలు లాగడం ద్వారా ప్రభుత్వ డబ్బును లూఠీ చేశారని వైఎస్ జగన్ ప్రభుత్వం గుర్తించింది. 

హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వానని విజయవాడకు, గుంటూరుకు తరలించాక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాల కొరత ఏర్పడటాన్ని అనుకూలంగా తీసుకుని టీడీపీ నేతలు బరితెగించిన విషయం జగన్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది 

2016 మార్చి 7న టీడీపీ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. 2011లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకోసం తీసుకున్న ప్రైవేట్ భవనాలకు చెల్లిస్తూ వచ్చిన అద్దెను టీడీపీ ప్రభుత్వం అసాధారణంగా పెంచివేసింది.

వెల్లడయిన వివరాల ప్రకారం విజయవాడ, గుంటూరు పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలకోసం తీసుకున్న అద్దె భవనాలకు చదరపుటడుగుకు చెల్లిస్తున్న అద్దెను 7 రూపాయలనుంచి 18 రూపాయలకు అమాంతంగా పెంచివేశారు. అలాగే విశాఖపట్నంలో చదరపుటడుగుకు 7 నుంచి 12 రూపాయలకు, తిరుపతి పట్టణంలో7 నుంచి 10 రూపాయలకు అద్దెను పెంచుతూ జీవో జారీ చేశారు.

ఇతర కార్పొరేషన్లకు, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీలకు రెంటును చదరపుటడుగుకు రూ. 5.50 నుంచి రూ. 10లకుపెంచారు. ఇక సెలెక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలకు రూ. 5.5లనుంచి 8 రూపాయలకు అద్దెలను పెంచివేశారు. ఇక గ్రేడ్-1 మునిసిపాలిటీల్లో రూ.4.50ల నుంచి రూ. 8లకు ప్రభుత్వ భవనాల అద్దెను పెంచివేశారు. ఇతర మునిసిపాలిటీలు, మండల ప్రధాన కార్యాలయాలకు రూ. 3 నుంచి రూ.6 లకు అద్దెలు పెంచివేశారు.

దీనికి నాటి టీడీపీ ప్రభుత్వం చెప్పిన కారణం ఒకటే. పాతరేట్లకు అద్దెలకు లేదా లీజులకు భవనాలు ఇవ్వడానికి భవన యజమానులు ముందుకురావడం లేదని, స్థానిక మార్కెట్ ప్రకారం అద్దె రేట్లను పెంచాలని లేకుంటే తమ భవనాలు ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారని టీడీపీ ప్రభుత్వం చెప్పింది.

అయితే ఇలా ప్రయివేట్ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలకు ఇచ్చిన యజమానుల్లో చాలావరకు టీడీపీకే సంబంధించినవారు కావడం గమనార్హం. నాటి ప్రభుత్వం అనూహ్యంగా అద్దెలను పెంచివేశాక టీడీపీకి చెందిన భవన యజమానులు భారీ స్థాయిలో ప్రభుత్వసొమ్మును లూటీ ఛేసిన వైనం బయటపడటంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు పాత లీజు ఒప్పందాలన్నింటినీ రద్దు చేసిపడేసింది. 

ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వమే సొంతభవనాలను నిర్మిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle