newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ప్రభుత్వానికి చుట్టుకుంటున్న ఇసుక కొరత.. 6 మంది మృతి

04-11-201904-11-2019 10:35:12 IST
Updated On 04-11-2019 18:38:44 ISTUpdated On 04-11-20192019-11-04T05:05:12.346Z04-11-2019 2019-11-04T05:05:08.646Z - 2019-11-04T13:08:44.560Z - 04-11-2019

ప్రభుత్వానికి చుట్టుకుంటున్న ఇసుక కొరత.. 6 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రభుత్వం అనాలోచితంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని, పథకాన్ని ఉన్నట్లుండి ఆపివేస్తే ఎంతమంది జీవితాలపై ప్రభావం వేస్తుందో, ఎంతమంది జీవితాలు తల్లకిందులైపోతాయో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మెడకు చుట్టుకున్న ఇసుక కొరత సమస్య తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వాలు చేసే 99 మంచి పనులు కూడా ఒకే ఒక్క పెద్ద తప్పుతో ఎలా ప్రజల దృష్టిలో కొట్టుకుపోతాయో గత కొన్ని నేలలుగా ఆగిపోయిన భవన నిర్మాణ పనులు, వాటిపై ఆధారపడిన లక్షలాది మంది కూలీలు, కార్మికుల జీవితాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. 

శనివారం ఒక్కరోజే ఇసుక కొరత అనే పాము కాటుకు గురై ఇద్దరు నిర్మాణ కార్మికులు చనిపోవడం కలిచివేస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో నివసిస్తున్న గుర్రం నాగరాజు, పొన్నూరు వాసి అయిన అడపా రవి అనే భవన నిర్మాణ కార్మికులు శనివారం తమ జీవితాలను ముగించుకున్నారు.. కారణం పనులు దొరక్కపోవడమే. దీంతో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా జీవితాలు ముగించుకున్న వారి సంఖ్య ఆరుగురికి చేరింది. 

మేస్త్రీగా పనిచేస్తున్న నాగరాజు కొన్ని నెలలుగా పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్టంలో ఇసుక కొరత వల్ల నాగరాజు కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమయ్యాడు. పని దొరకలేదనే చింతతో అతడు విపరీతంగా తాగుడుకు అలవాటు పడ్డాడని, నిత్యం డబ్బుకోసం భార్యను వేధిస్తూ వచ్చాడని పోలీసులు తెలిపారు.

కాగా అడపా రవి కుటుంబవివాదం కారణంగా చనిపోయాడని, అతని మృతిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఈ రెండు మరణాలతో పైకాపా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుడ్డాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ విషయమై మాట్లాడుతూ మరొక నిర్మాణ కార్మికుడు పని లేక తన జీవితాన్ని ముగించుకున్నాడని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని దుయ్యబట్టారు. గత పదిరోజుల్లో పది మంది సామాన్యులు ఇసుక కొరత సమస్యతో చనిపోయినా వైకాపా ప్రభుత్వం, దాని నాయకులు చనిపోయివారిని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ప్రభుత్వం మేల్కొనడానికి ముందు ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలకు గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై దాడి చేయడానికి దొరికిన పెద్ద ఆయుధం ఇసుక కొరత. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలను రద్దు చేసింది. సెప్టెంబరులో ఆన్‌లైన్‌లో ఇసుకను విక్రయించే నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. కానీ భారీగా ఏర్పడిన డిమాండును తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కొరత కారణంగా ఇసుక ధర చుక్కలంటింది. ఇది నిర్మాణ కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీసింది.

కాని ఎన్నడూ లేనంత భారీగా వచ్చిన వరదల కారణంగానే రాష్ట్రంలో అనూహ్యంగా ఇసుక కొరత ఏర్పడిందని ప్రభుత్వం సమర్థించుకుంటూ వస్తోంది. మంత్రులతోపాటు ప్రభుత్వ సలహాదారులు కూడా ఇదే పాట పాడటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన దేవులపల్లి అమర్ కూడా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రకటన చేశారు.

నదుల్లో వరదలు నిలిచిపోయిన తర్వాతే ఇసుకను రీచ్‌ల నుంచి తవ్వి తీయగలం. పోటెత్తుతున్న వరదల సమయంలో ఇసుకను తవ్వి తీయడానికి ప్రయత్నించడం ప్రాణాంతకమే కాదు ప్రమాదకరం కూడా. అందుకే ఇసుక అందుబాటులో ఉన్న 267 రీచ్‌లలో ప్రస్తుతం 62 రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వడానికి అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి అవసరమైనంత మేరకు పూర్తిగా ఇసుకను సరఫరా చేయడం సాధ్యమేనా అని అమర్ ప్రశ్నించారు. ఎట్టకేలకు వానలు తగ్గుముఖం పట్టాయని, స్వల్ప కాలంలోనే ఇసుకను సమృద్ధిగా సరఫరా చేయడానికి వీలవుతుందని అమర్ చెప్పారు.

ఒకటి మాత్రం నిజం.. ఇసుక కొరత కారణంగా చనిపోతున్న సామాన్య కూలీల మరణాల పట్ల ప్రభుత్వం కానీ, మంత్రులుకానీ, సలహా దారులు కానీ కించిత్ సానుభూతి ప్రదర్శించకపోవడం బాధితులను రగిలిస్తోంది. రైతు ఆత్మహత్య చేసుకుంటే లక్షల రూపాయలు సహాయం అక్కడికక్కడే ప్రకటిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మాణ కార్మికుల మరణాల పట్ల కనీస స్పందన కూడా లేకుండా వ్యవహరించడం ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతోంది.

ప్రతిపక్ష పార్టీలకు ఇసుక కొరత అనేది ప్రభుత్వంపై బాణాలు గురిపెట్టడానికి లడ్డూలాంటి అవకాశం ఇచ్చింది. ఆదివారం విశాఖపట్నంలో జనసేనాధిపతి పపన్ కల్యాణ్ ఇసుక కొరత మరణాలపై నిర్వహించిన భారీ ర్యాలీ బ్రహ్మాండంగా విజయవంతమైంది. అశేష ప్రజానీకం పవన్ ర్యాలీలో స్వచ్చందంగా పాల్గొన్నారు. 

ప్రభుత్వం ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించానని, పలు సామాజిక వర్గాలకు ప్రత్యక్ష నగదు సహాయం అందించానని, ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తానని రోజూ డప్పు వాయించుకున్నా సరే ఇసుక కొరత అనేది ప్రభుత్వం పాలిట భూతంలా వెంటాడుతోంది.

కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న నిర్మాణ రంగంలో అనాలోచిత చర్యలు చేపడితే, అవినీతిపై గాల్లో కత్తులు దూస్తే కలిగే విపరిణామాలకు ఇసుక కొరతే సాక్ష్యం. ఏ ప్రభుత్వానికైనా సరే అవినీతిపై పోరాటం సాకుతో అసమర్థంగా వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందన్నదానికి ఇసుక కొరత పెద్ద గుణపాఠంగా మిగులుతుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle