newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ప్రభుత్వానికి ఆర్థిక భారం- అక్రమార్కులకు మంచి ఆదాయ వనరు

10-09-201910-09-2019 17:38:24 IST
2019-09-10T12:08:24.241Z10-09-2019 2019-09-10T12:08:15.358Z - - 20-09-2019

ప్రభుత్వానికి ఆర్థిక భారం- అక్రమార్కులకు మంచి ఆదాయ వనరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కిలో రూపాయి బియ్యం పథకాన్ని తెలుగు రాష్ట్రాలలో ఇంకా అమలు చేస్తున్నారు. బియ్యం పక్కదారి పడుతున్న సంఘటనలు ఎన్ని వెలుగులోనికి వస్తున్నా ఈ పథకం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ పకడ్బందీగా సాగుతున్నదనడంలో సందేహం లేదు. అయితే ఈ పథకం ఆవశ్యకత ఏమిటి. అవసరం ఎంత? అన్న ప్రశ్నలకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం లభించదు. ఒక కరివేపాకు కట్ట కూడా రూపాయి కంటే తక్కువకు దొరకని నేటి పరిస్థితుల్లో కిలో రూపాయి బియ్యం కొనసాగింపు వల్ల లబ్ధిదారుడుకి ఒనగూరే మేలు ఎమిటన్నది ఒక ప్రశ్న అయితే...ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానా మీద పడే భారం మరో ప్రశ్న. ప్రభుత్వం ఆ ఆర్థిక భారాన్ని భరించగలిగే పరిస్థితి ఉందా? 

ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం..అదేమిటంటే...ఈ పథకాన్ని ఒక సారి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నదే. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ప్రవేశ పెట్టినప్పుడు లబ్ధిదారులకు నిజంగా అది ఒక వరం. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయి. బియ్యంతో సమానంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. బియ్యం పథకం కొనసాగించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారిందన్నది నిర్వివాదాంశం. అయినా సంక్షేమం పేర...ఓట్ల రాజకీయం కోసమే ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాయి. 

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేసి సన్నబియ్యాన్ని ప్యాకెట్లలో సరఫరాకు శ్రీకారం చుట్టడంతో ఇదే వ్యాపార పథకంగా మారనుందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉంది. దానికి తోడు మాంద్యం. ఈ పరిస్థితుల్లో బియ్యం పథకాన్ని కొనసాగించడం...లబ్ధి దారులను మరింతగా ఆకర్షించేందుకు సన్న బియ్యం ప్యాకెట్లలో ఇంటికే చేరవేయడం వల్ల లబ్ధిదారుల ప్రయోజనం సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వానికి ఆర్థిక భారం, దళారులకు బియ్యం పక్కదారి పట్టించడం తేలిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

కేవలం ఓటు బ్యాంకు కోసం కొనసాగిస్తున్న బియ్యం పథకం వంటివి అక్రమార్కులకు సులభ ఆదాయ మార్గాలుగా మారిపోయాయని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇందుకు ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఈ రేషన్ బియ్యం బడాబడా హోటళ్లలో అల్పాహారం తయారీకి ఉపయోగపడుతున్నది. అత్యధిక లబ్ధిదారులు బియ్యాన్ని తినడానికి కంటే దొడ్డిదారిన అమ్ముకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఏపీ సర్కార్ ప్యాకెట్లలో సరఫరా చేయడం వల్ల మరింత తేలికగా పక్కదారి పట్టే అవకాశం ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle