newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ప్రభుత్వంలో పెత్తనం కోసమే వైసీపీలో కుమ్ములాట?

11-10-201911-10-2019 09:26:11 IST
2019-10-11T03:56:11.935Z11-10-2019 2019-10-11T03:56:09.761Z - - 08-12-2019

ప్రభుత్వంలో పెత్తనం కోసమే వైసీపీలో కుమ్ములాట?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో వైసీపీ అధికారంలోకొచ్చి నెలలు గడిచేకొద్దీ కుమ్ములాటలు కూడా బయటపడుతున్నాయి. జిల్లాలకు జిల్లాలే ఆ పార్టీకి పూర్తి స్థానాలను కట్టబెట్టారు. దీంతో ఏ జిల్లాలలో చూసినా అందరూ ఆ పార్టీ నేతలే కనిపిస్తున్నారు. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే తాను సీనియర్ లీడరనంటే.. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే తనకు అధిష్టానం వద్ద పలుకుబడి ఉందంటున్నారు. ఇక దీనికి తోడు ఒక నియోజకవర్గానికి చెందిన నేత మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం మరో సమస్యైతే కొందరు మంత్రులు కూడా మరో జిల్లాకు ఇంచార్జి మంత్రి. వీళ్ళు చాలదన్నట్లు జిల్లా పార్టీల అధ్యక్షులు, మరికొందరు ఎంపీలకు అనుబంధం ఉండడం ఇంకో శిరోభారం.

ఫలితంగా పార్టీలో తమ మాటే వినాలని ఎవరికి వారు పంతాలకు పోతుండడంతో గ్రూపులు మొదలై కుమ్ములాటకు దారితీస్తుంది. ఇందుకు ఉదాహరణే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి-ఎంపీ నందిగం సురేష్ వివాదం. ప్రభుత్వం ఏర్పడ్డ రెండో నెలలోనే ఈ వివాదం చెలరేగగా సాక్షాత్తు సీఎం పంచాయతీ చేశారు. తాజాగా నెల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి-కాకాణి గోవర్ధన్ రెడ్డి వివాదం చెలరేగడం.. అధిష్టానం దృష్టికి వెళ్లి పెద్దలకు అప్పగించడంతో వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించి పంచాయతీ చేయడం జరిగిపోయింది. నిన్న నెల్లూరు వివాదం పరిష్కారమైందో లేదో ఈరోజు మరో వివాదం వైసీపీలో మొదలైంది. అదే అనంతపురం జిల్లా మంత్రి-ఎమ్మెల్యేల మధ్య వివాదం.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అనంతపురంలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనలో సీఎంకు జిల్లా మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిలు స్వాగతం పలికారు. అయితే హెలిపాడ్ దగ్గర జగన్‌‌కు స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేకపోవడంపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినా ఆహ్వాన జాబితాలో తన పేరు లేకపోవడంపై అక్కడే మంత్రి శంకర్‌నారాయణ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి చివరికి సీఎం కార్యక్రమం అని కూడా లేకుండా వివాదానికి దిగారు. అయితే అప్పుడు జిల్లా నేతలు సర్థిచెప్పడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది.

నిజానికి అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల పరిస్థితి అదేనని ఆ పార్టీనేతలే చెప్పే మాట. హిందూపురం, ఉరవకొండ మినహా అన్ని స్థానాలలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే. కానీ అధికార కార్యక్రమాలలో కూడా ఒకరిని గౌరవించే సంస్కృతి మరొకరికి ఉండదట. అందరూ తమ పెత్తనం సాగాలనే పోటీ పడుతుంటారట. ఎమ్మెల్యేలు సైతం మంత్రయితే నాకేంటి? హైకమాండ్ దగ్గర మనకి కమాండ్ ఉందంటూ రెచ్చిపోతున్నారు. ఫలితంగా ఇప్పటికే మొత్తం మూడు వర్గాలలో క్యాడర్ రెండు గ్రూపులుగా చీలిపోయారని టాక్. అక్కడి నేతలు ఇకనైనా ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోకపోతే ఏదొక రోజు గుంటూరు, నెల్లూరు నేతల పంచాయతీ మాదిరే అనంతపురం నేతల పంచాయతీ కూడా అమరావతికి చేరాల్సి వచ్చేలా ఉందని వినిపిస్తుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle