newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన కేంద్రం

25-06-201925-06-2019 09:59:38 IST
Updated On 25-06-2019 14:01:07 ISTUpdated On 25-06-20192019-06-25T04:29:38.787Z25-06-2019 2019-06-25T04:29:33.115Z - 2019-06-25T08:31:07.956Z - 25-06-2019

ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన కేంద్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2014 నుంచి ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఇప్పటి సీఎం జగన్ వరకూ అంతా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఏపీ ఆశలపై మళ్లీ నీళ్ళు చల్లినట్టు అయింది.

దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. హోదా కోసం ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, రాజస్థాన్‌, బిహార్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కేంద్రానికి వినతులు వచ్చినట్లు చెప్పారు.

Image may contain: text 

బిహార్‌కు చెందిన జేడీయూ సభ్యుడు కౌశలేంద్రకుమార్‌ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో ఆమె సమాధానమివ్వడంపై ఏపీలో చర్చ జరుగుతోంది.  భౌగోళిక పరిస్థితులు, ఆర్థికంగా నిలబడే శక్తి లేకపోవడం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలున్న రాష్ట్రాలకే గతంలో ‘జాతీయ అభివృద్ధి మండలి’ ప్రత్యేక హోదా ప్రకటించిందని చెప్పారు. అందులో పరిశ్రమల రాయితీల కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలూ లేవని వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా ఇచ్చి సహకరించకపోతే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుందని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత వివరించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

2014లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి అప్పులు రూ.90 వేల కోట్లు ఉంటే ఐదేళ్లలో అవి రూ.2.68 లక్షల కోట్లకు చేరాయన్నారు. వాటిపై ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకపక్క కేంద్ర సాయం అందక, మరోపక్క అప్పులు ఇలాగే పెరిగిపోతే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిపోతుందన్నారు. కేంద్రం ఏపీకి హోదా ఇచ్చే విషయం మరోమారు పరిశీలించాలని ఆయన కోరారు.కేంద్రం తాజా ప్రకటనపై సీఎం జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle