newssting
BITING NEWS :
*మధ్యప్రదేశ్ లో పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబె... యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మరో అనుచరుడు హతం* కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం... దేశ‌వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి, పలు రాష్ట్రాలలో కేసుల పెరుగుదల పై చర్చ*యూపీ: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే అనుచరుడు ప్రభాత్‌ విశ్రాను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు..నిన్న ఫరీదాబాద్‌ ప్రభాత్‌ మిశ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు*ఢిల్లీ: నీర‌వ్ మోడీకి ఈసీ షాక్‌... రూ.327 కోట్ల విలువైన ఆస్తులు జ‌ప్తు చేసిన ఈడీ*హైద‌రాబాద్‌: హైకోర్టులో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పరీక్షల నిర్వహణపై విచారణ.. యూజీసీ నిబంధనల మేరకు నడుచుకుంటామని కోర్టుకి చెప్పాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం*హైద‌రాబాద్‌లో గ‌త 24 గంట‌ల్లో 1,590 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లా 99, మేడ్చ‌ల్‌ 43, క‌రీంన‌గ‌ర్‌ 14, సంగారెడ్డి 20, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ 15, న‌ల్గొండ‌ 31, నిజామాబాద్‌ 19, వ‌రంగ‌ల్ రూర‌ల్‌ 26, సిరిసిల్ల‌లో 13 పాజిటివ్ కేసులు*రమేష్ ఆస్పత్రికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు *దేశంలో కరోనా కేసుల ఉధృతి.24 గంటల్లో 22,752 కేసులు.. 7,60.761, మరణాలు 21,018

ప్రత్యేక హోదాను జగన్ పక్కన పెట్టేసినట్టేనా?

30-11-201930-11-2019 09:38:50 IST
Updated On 30-11-2019 11:50:26 ISTUpdated On 30-11-20192019-11-30T04:08:50.778Z30-11-2019 2019-11-30T04:08:48.940Z - 2019-11-30T06:20:26.639Z - 30-11-2019

ప్రత్యేక హోదాను జగన్ పక్కన పెట్టేసినట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరిగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. ఆ ఎన్నికలకు ముందు ఊరూర తిరిగిన జగన్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఊదరగొట్టారు. ఇక ఆ ఎన్నికలలో తనకు కనుక పాతికమంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదాను కేంద్రం నుండి తాకట్టు విడిపించి ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు. ఏపీ ప్రజలు కూడా ఊహలలో తేలిపోతూ వైసీపీకి బంపర్ మెజార్టీ ఇచ్చారు.

ఇక ఎన్నికల అనంతరం విషయానికి వస్తే ఫలితాల తెల్లవారే సీఎం జగన్ ఢిల్లీలో పెద్దలను కలిసి బయటకు వచ్చి మీడియా ముందే బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకుంటే మనకి డిమాండ్ చేయడానికి ఉండేదని, కానీ ఇప్పుడు బీజేపీ దేశంలో రెండో సారి అధికారంలోకి వచ్చి తిరుగులేని శక్తిగా మారిందని.. ఇప్పుడు తమ ప్రయత్నం తాము చేయడం తప్ప మేడలువంచే శక్తి తమకి లేదని చెప్పకనే చెప్పేశారు.

ఇక అధికారంలోకి వచ్చాక ఈ ఆరునెలలలో కూడా సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఈ కేంద్ర పెద్దలను కలిసి పలు విజ్ఞప్తులు ఇచ్చారని ఢిల్లీలో ఏపీ ప్రతినిధులు మీడియాకు సమాచారమిచ్చేవారు. అందులో ప్రత్యేకహోదా అంశం కూడా చాలా సాధారణంగానే కనిపించేది. కేంద్రం ఏమన్నదో ఏపీ ప్రభుత్వం చెప్పేది లేదు కానీ బీజేపీ నేతలు మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రత్యేకహోదా అన్నది ముగిసిన అధ్యాయమేనని బహిరంగంగానే చెప్పేశారు.

కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే సీఎం జగన్ ప్రత్యేకహోదా విషయంలో ఇన్నాళ్లు చేసింది మోసమేనని అర్ధం చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి లేఖలు అందలేదని తేల్చిచెప్పేసింది. పనిలో పనిగా ప్రత్యేకహోదా అన్నది ముగిసిన అధ్యాయమేనని మరోసారి గుర్తుచేసింది.

అయితే మరి సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతిసారి ప్రత్యేకహోదాను కోరామని చెప్పడం.. ప్రభుత్వం ప్రతినిధులు మీడియాకు ఇచ్చిన సమాచారం అంతా ప్రజలను మభ్యపెట్టేందుకేనా? అని అడిగినా ఏపీ ప్రభుత్వం నుండి సమాధానం రావటం కష్టమే. కేంద్ర తాజా సంచలన ప్రకటనతో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు మరోసారి సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలకు దిగారు.

ఆరు నెలలుగా హోదా అంశాన్ని కేంద్రం వద్ద కనీసం ప్రస్తావించని సీఎం ప్రజలకు ఆ అంశం మీద మాయమాటలు చెప్పి నమ్మించి గొంతుకోశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కన్నెర్ర జేయడంతోనే సీఎం జగన్ ఎక్కడ తన రాజకీయ జీవితానికి బ్రేక్ పడుతుందోనని ఏపీ హోదాను తాకట్టు పెట్టేశారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాటల దాడికి దిగారు. మరి కేంద్రం పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టిన ఈ వ్యవహారంపై వైసీపీ సమాధానం ఏమని చెప్పనుందో చూడాల్సి ఉంది.

 

 

 ‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

   10 minutes ago


బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

   18 minutes ago


అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

   18 minutes ago


సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

   12 hours ago


మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

   13 hours ago


కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

   13 hours ago


ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

   19 hours ago


వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

   21 hours ago


కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

   21 hours ago


ప్రగతి భవన్ వద్ద యువకుడి హల్ చల్.. సర్కార్‌‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రగతి భవన్ వద్ద యువకుడి హల్ చల్.. సర్కార్‌‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle