newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ప్రతీకారాలు తప్ప కరోనాపై పటిష్ట చర్యలేవి?

11-04-202011-04-2020 15:51:35 IST
Updated On 11-04-2020 15:58:02 ISTUpdated On 11-04-20202020-04-11T10:21:35.060Z11-04-2020 2020-04-11T10:21:23.224Z - 2020-04-11T10:28:02.380Z - 11-04-2020

ప్రతీకారాలు తప్ప కరోనాపై పటిష్ట చర్యలేవి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ సర్కార్ తీరుపై టీడీపీ, బీజేపీలు మండిపడ్డాయి. ప్రతీకార చర్యలపై ఉన్న శ్రద్ధ కరోనా నివారణపై లేవని విమర్శించాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్ సర్కార్ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా వైరస్ నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొందన్నారు. జగన్ మాత్రం బ్లీచింగ్ చల్లుకుని పారాసెట్మాల్ వేసుకోమని సెలవిచ్చినందునే వైరస్ మూడవ దశకు చేరుకుందన్నారు. పాలన చేతకాదన్నది రాష్ట్ర ప్రజలకు జగన్ చర్యలతో తేటతెల్లమైంది. 

లాక్ డౌన్ ఆంక్షలను వైకాపా ప్రజాప్రతినిధులు ఉల్లంఘిస్తున్నారని, అయినా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. మంత్రి సురేష్ తో పాటు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తే వారిని ఎందుకు క్వారంటైన్ లో పెట్టలేదన్నారు. రాష్ట్రం మంచికోసం ఈ సూచనలు పాటించండని చంద్రబాబు లేఖలు రాస్తుంటే దానినీ వైకాపా నేతలు తప్పుబట్టడం దురదృష్టకరం అన్నారు. 

ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పేదలు ఎలా బతుకుతారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేఅన్నారు. సంక్షోభ సమయంలోను జగన్ తన స్వంత పత్రికకు కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. మరోవైపు టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే, శ్రవంగలపూడి అనిత కరోనా వేళ ప్రాణభయంతో ఓ వైద్యుడు తన సమస్యను చెప్పుకుంటే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. 

జగన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైద్యుడు సుధాకర్‍ని బలిచేశారని, తనను ఎదిరించేవారిని ఆయన వదిలించుకుంటారని, అంబులెన్స్ లో సస్పెన్షన్ ఆర్డర్ పంపడానికి వినియోగిస్తారా? అన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లేమో ఎన్ - 95 మాస్కులు వేసుకొని ఇంట్లో కూర్చున్నారని, అవసరమైతే మెడ్ టెక్ జోన్ కూడా వైసీపీ రంగులు వేస్తారేమో? అని ఆమె అనుమానం వ్యక్తంచేశారు.

డాక్టర్ల మాస్కులు, శానిటైజర్లకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారని, కరోనా సందర్బంలోను అవినీతి రాజకీయాలు చేయడం హాట్సాఫ్ అన్నారు. ఇటువంటి సమయంలోను ఇసుక, ఛీప్ లిక్కర్ ను అక్రమంగా అమ్ముకుంటున్న ఘనత వైసీపీ నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషనర్ తొలగింపు మాజీ జస్టిస్ కు ఎస్ఈసీ బాధ్యతలు అప్పగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశారు. అంతేకాదు ఇంత జెట్ స్పీడ్ తో సస్పెన్షన్ లు నియామకాలు చేస్తున్న మీరు అదే జెట్ స్పీడ్ తో ఈ కరోన ఖల్లోలం లో వైద్య సిబ్బందికిపీపీఈ  సూట్ లు ఇవ్వండని టీడీపీ ఎమ్మెల్యు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. 

రోగులకు వైద్యం చేయాలంటే డాక్టర్లు వెనుకాడే పరిస్థితి మంచిది కాదు. కరోనాపై పోరాడుతున్న వైద్యులందరికీ మాస్కులు, PPEలు అందించాలి. రక్షణ పరికరాలు లేవని చెప్పినందుకు ఒక డాక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయడం తగదు. రక్షణ పరికరాలు లేకుండా వైద్యం చేయడమంటే ఆయుధాల్లేకుండా సైనికులను యుద్ధానికి పంపినట్టన్నారు బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ వై.సుజనా చౌదరి

రోమ్ తగులబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకున్నట్టు, ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే సీఎం  జగన్మోహనరెడ్డిగారు మాత్రం సొంత కక్షలు తీర్చుకోవడంలో బిజీగా వున్నారు. తాము అనుకున్నట్లు స్థానిక ఎన్నికలు జరపలేదని SEC రమేష్ కుమార్ పదవీకాలం తగ్గిస్తూ హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయడం దీనికి నిదర్శనం. కక్షపూరిత చర్యలు మానుకుని కరోనాపై దృష్టి పెడితే బాగుంటుందని చురకలంటించారు ఎంపీ వై.సుజనా చౌదరి.

 

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   9 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   9 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle