newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకు హాజరవ్వాల్సిందే.. సీబీఐ

03-10-201903-10-2019 09:11:10 IST
2019-10-03T03:41:10.679Z03-10-2019 2019-10-03T03:41:07.460Z - - 19-02-2020

ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకు హాజరవ్వాల్సిందే.. సీబీఐ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్రమాస్తుల కేసులో తనపై జరుగుతున్న విచారణకు గాను ప్రతి శుక్రవారం కోర్టుగా హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు యివ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన అధికారాన్ని ఉపయోగించి సాక్ష్యుల్ని ప్రభావితం చేయవచ్చని సీబీఐ పేర్కొంది. హైదరాబాద్‌లో సీబీఐ కేసులను విచారిస్తున్న ప్రిన్సిపల్ కోర్టు స్పెషల్ జడ్జి వద్ద సీబీఐ తన కౌంటర్ దాఖలు చేసింది

తనపై ఉన్న కేసులనుంచి వ్యక్తిగతంగా హాజరు కావడంపై మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ గతనెలలో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయన పిటిషన్‌ చట్టప్రకారంగా కానీ లేక వాస్తవాల ప్రాతిపదికన కూడా చెల్లుబాటు కాదని సీబీఐ తోసిపుచ్చింది. తనపై మరకలను తొలగించుకోకుండా, భౌతిక వాస్తవాలను అణగదొక్కడం ద్వారా వైఎస్ జగన్ సీబీఐ కోర్టు ముందు ఈ పిటిషన్ దాఖలు చేశారని సీబీఐ ఆరోపించింది. 

విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు నిస్తే, వైఎస్ జగన్‌కు అది పూర్తి స్వేచ్ఛను కల్పిస్తుందని, దాంతో  ఆయన రాజకీయంగాగానీ, బలాన్ని ఉపయోగించి కానీ, డబ్బుతో ప్రలోభపెట్టి కానీ సాక్ష్యులను తారుమారు చేయవచ్చని సీబీఐ ఆరోపించింది. 

తాను కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందువల్ల, ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పేలవమైన ఆర్థిక పరిస్థితుల రీత్యా తనకు వారం వారీ విచారణ నుంచి మినహాయింపును ఇవ్వవలసిందిగా జగన్ కోర్టును అభ్యర్థించడం తెలిసిందే.

పిటిషనర్ తనపై మోపబడిన 11 చార్జిషీట్లలోనూ, వ్యక్తిగత హోదాలో లేక తాను ప్రైవేటుగా నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ వాదించింది. వాస్తవ సమస్యలనుంచి కోర్టు దృష్టిని మళ్లించడానికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను, ఆదాయాన్ని సాకుగా చూపుతున్నారని, కాబట్టే పిటిషనర్‌ వాదనకు ఈ అంశంలో పసలేదని సీబీఐ పేర్కొంది. 

పిటిషనర్‌ చేసిన నేరాలపై గతంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసే స్థాయి నేరాలకు పిటిషనర్ పాల్పడ్డారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయాన్ని సీబీఐ కోర్టుకు గుర్తు చేసింది. 

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ లేక అమరావతి నుంచి ప్రభుత్వ నిర్వహణ వంటివి పిటిషనర్‌పై ఇతర నిందితులుపై ఆలోపించబడిన నేరాలస్థాయిని, వాస్తవాలను  ఏమాత్రం తగ్గించలేవని సీబీఐ ఎత్తి చూపింది.

పిటిషనర్‌పై కేసులో చివరి చార్జి షీటు మోపి ఇప్పటికే ఆరేళ్లయిందని, కానీ విచారణ మాత్రం ఇంకా ప్రారంభమే కాలేదని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. అంటే పిటిషనర్ ఏదో ఒక కారణం చూపి విచారణ ప్రక్రియను అడ్డుకుంటున్నారనటానికి ఇదే ఉదాహరణ అని సీబీఐ తెలిపింది.

తాను ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి వైఎస్ జగన్‌ విచారణకు హాజరు కాకుండా సీబీఐ కోర్టు మినహాయింపునిచ్చింది. 2017లో కూడా వైఎస్సార్ సీపీ అధినేత ఇలాగే న్యాయ విచారణనుంచి మినహాయింపు కోరుతూ భగంపడ్డారు. తాను ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున న్యాయ విచారణ నుంచి మినహాయింపును ఇవ్వాలన్ని జగన్ ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. కావాలంటే వారం వారం ప్రాతిపదికన ఆయన మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.

వైఎస్ జగన్‌కు కోర్టు మినహాయింపుపై సీబీఐ అత్యుత్సాహం సాధారణ న్యాయప్రక్రియలో భాగంగా జరిగిందా లేక ఇతరేతర ప్రమోయాల్లో  భాగంగా జరిగిందా అనేది స్పష్టం కావడం లేదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle