newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ప్రజా చైతన్యం.. ఓటెత్తిన ఆంధ్రా జనం

12-04-201912-04-2019 18:33:58 IST
Updated On 12-04-2019 18:35:30 ISTUpdated On 12-04-20192019-04-12T13:03:58.382Z12-04-2019 2019-04-12T13:03:55.957Z - 2019-04-12T13:05:30.369Z - 12-04-2019

ప్రజా చైతన్యం.. ఓటెత్తిన ఆంధ్రా జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లలో చైతన్యం బాగా కనిపించింది. తమకున్న హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మండే ఎండను సైతం లెక్క చేయలేదు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు వచ్చినా ఓపికగా మళ్ళీ మళ్ళీ ఓటు వేయడానికి రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఓటు అనే తమ ఆయుధాన్ని ఉపయోగించారు.

తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రధానంగా బరిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల హోరాహోరీ ప్రచారం అనంతరం.. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాంకేతికంగా సాయంత్రం ఆరుగంటలకే పోలింగ్‌ సమయం ముగిసినా పలు ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపు, తదితర కారణాలతో కొన్నిచోట్ల పోలింగ్‌ అర్ధరాత్రి వరకు కొనసాగింది. 

పోలింగ్‌ సమయం ముగిసేలోగా క్యూ లైన్లలో నిలబడిన ప్రతి ఒక్కరినీ ఓటు వేసేందుకు అనుమతించారు. కొంతమంది చివరి నిముషంలో వచ్చి నిరాశతో వెనుతిరగడం కనిపించింది.  సాయంత్రం సమయంలో ఓటేసినవారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది.

‘‘మాక్‌పోలింగ్‌ సమయంలోనే కొన్ని ఈవీఎంలను మార్చాం. మరికొన్ని ఈవీఎంలను పోలింగ్‌ జరుగుతుండగా మార్చాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో ఈవీఎంలు మరమ్మతు చేయకపోవడం వల్ల కూడా ఉదయం పూట ఓటర్లకు సమయం వృథా అయింది. చాలాచోట్ల ఓటర్లు గంటలకొద్ది క్యూలో నిలబడాల్సి వచ్చింది’’ అని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి జీకే ద్వివేది వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85% పోలింగ్, అత్యల్పంగా విశాఖపట్నం, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 70% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఈవీఎంలను భద్రపరిచేందుకు 68 స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఈవీఎంలకు సీల్‌ వేసి ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన 319 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2,118 మంది అభ్యర్థుల భవిష్యత్‌ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ప్రజా తీర్పు కోసం మే 23వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle