newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ప్రజావేదికను కూల్చేస్తారా? జగన్ సంచలన నిర్ణయం

24-06-201924-06-2019 15:06:00 IST
2019-06-24T09:36:00.885Z24-06-2019 2019-06-24T09:35:58.403Z - - 17-07-2019

ప్రజావేదికను కూల్చేస్తారా? జగన్ సంచలన నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడు టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ఇవాళ కలెక్టర్ల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అక్రమ క‌ట్టడాల కూల్చివేత ప్రజావేదిక భ‌వ‌నం నుంచే మొద‌లు పెడుతున్నాం. ప్రజావేదిక‌లో ఇదే క‌లెక్టర్ల చివ‌రి స‌మావేశం, రేపు ఎస్పీల‌తో మీటింగ్ త‌ర్వాత ఎల్లుండి నుంచి ఈ భ‌వ‌నాన్ని కూల్చివేస్తున్నాం అని క‌లెక్టర్ల మీటింగ్‌లో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు కలిగిస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ నేతలు అనూరాధ, వైబి రాజేంద్రప్రసాద్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. 

కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదిక మీద సీరియస్ చర్చ జరిగింది. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, దీనికి చెక్‌ పెట్టాల్సిన అవరసముందన్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని వెల్లడించారు. బుధవారం నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజావేదికను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని సీఎం జగన్‌ ఆరోపించారు.

ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగాఈ భవనాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకోసం నిర్మించారు. అయితే పేరుకే ప్రజావేదిక కానీ, అదంతా టీడీపీ కార్యకలాపాలకు వేదికయిందనే ఆరోపణలున్నాయి. 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం, విపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖపై కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా జగన్ నిర్ణయం టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle