newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు అదే తేడా...!-పార్ట్- 1

05-03-201905-03-2019 07:39:16 IST
Updated On 05-03-2019 07:39:41 ISTUpdated On 05-03-20192019-03-05T02:09:16.391Z05-03-2019 2019-03-05T02:03:26.424Z - 2019-03-05T02:09:41.070Z - 05-03-2019

ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు అదే తేడా...!-పార్ట్- 1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఏపీలో ప్రతి ఒక్కరి నోటి నుంచి ఒకే మాట వస్తోంది. అప్పుడు అన్నయ్య, ఇప్పుడు తమ్ముడు. ఏం చేస్తారు, వారితో ఏం ఒరుగుతుంది? ఈ మాట చాలా మంది నోటి నుంచి వింటున్నాం. కానీ అప్పటి, ఇప్పటి పరిస్థితులను కొంచెం అర్థం చేసుకుంటే చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయాల మధ్య తేడా ఏంటో అర్థం అవుతుంది. పీఆర్పీ పెట్టిన కొత్తల్లో చిరంజీవి మొదటగా మేధావులను సంప్రదించారు. వారితో పలుమార్లు చర్చల తర్వాత స్పార్క్ అనే సామాజిక సంస్థ ఏర్పాటు చేశారు. 

పార్టీలో చేరే కార్యకర్తలకు రాజకీయాలు అంటే ఏంటో, ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఓ రకంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తల్లో ఎన్టీఆర్ గండిపేట రాజకీయ పాఠశాల వంటిదే అనుకోవాలి. కానీ పవన్ కల్యాణ్ ఇందుకు విరుద్ధం. పార్టీ పెట్టే ముందు తనకు తానే మేధావితనంగా ఆలోచించారు.

సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. చేగువేరా స్పూర్తి, గుంటూరు శేషేంద్రశర్మ కవితలు... ఇలా పలు విషయాలను తెల్సుకుని జనం మధ్యకు వచ్చారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అభిమానులతో పాటు ఓ స్థాయి ఉన్న నేతలు క్యూ కట్టారు. అప్పట్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి భిన్నంగా రాజకీయం ఉంటుందని ప్రకటించారు చిరంజీవి.

ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కూడా జనానికి దగ్గరైన రోజుల్లో, అంటే రాజకీయ శూన్యత లేని పరిస్థితుల్లో పార్టీ పెట్టి జనంలోకి వెళ్లారు చిరంజీవి. తన సినీ గ్లామర్ సాయంతో జనాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే పరిస్తితి ఎదుర్కొంటున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు అధికారంలో ఉన్న టీడీపీ, మరోవైపు బలంగా ఉన్న వైసీపీలకు భిన్నంగా పార్టీ నడుపుతున్నారు పవన్ కల్యాణ్.

అంతేకాదు... ఇప్పుడు ఏపీలో కూడా పొలిటికల్ వాక్యూమ్ లేదు. కానీ జనంలో క్రేజ్ సంపాదించుకున్నారు పవన్. అప్పట్లో చిరంజీవి అవునన్నా, కాదన్నా ఆయన పార్టీ వెంట నడిచింది కాపులే. ఇప్పుడు జనసేనకు దన్నుగా నిలుస్తోంది కూడా కాపులే.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగింది. టీఆర్ఎస్, కామ్రేడ్లతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు, ఒంటరిగా చిరంజీవి పోటీ చేశారు. ఇప్పుడు కామ్రేడ్లతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. వారి బలం అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతకంటే తగ్గింది. ఒక్కోసారి లెఫ్ట్ పార్టీ నేతలకు వారి సొంత ఓట్లే అక్కరకు రావన్నది వేరే విషయం. 

(ఇంకా ఉంది)


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle