newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

ప్చ్.. గవర్నర్ స్పీచ్‌పై టీడీపీ స్పందన

14-06-201914-06-2019 13:20:20 IST
Updated On 22-06-2019 15:58:56 ISTUpdated On 22-06-20192019-06-14T07:50:20.447Z14-06-2019 2019-06-14T07:50:18.358Z - 2019-06-22T10:28:56.437Z - 22-06-2019

ప్చ్.. గవర్నర్ స్పీచ్‌పై టీడీపీ స్పందన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చప్పగా సాగిందని టీడీపీ విమర్శించింది. నవ్యాంధ్ర ప్రజలు ఆశించినట్టుగా గవర్నర్ ప్రసంగం లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. చేతి వృత్తుల వారికి ఏం చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. జలయజ్ఞం తరహాలో నీటి ప్రాజెక్టుల ప్రస్తావన ఉందని బాలకృష్ణ అన్నారు.  గవర్నర్‌ ప్రసంగం అంటే స్వంత ప్రసంగం కాదని, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు అందులో ఉండాలని  టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో చాలా అంశాలపై స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

గవర్నర్‌ ప్రసంగం నవరత్నాలకే పరిమితమైందని అవహేళన చేశారు టీడీపీ నేతలు. జనం ఎంతో ఎదురుచూస్తున్న ఆంధ్రుల రాజధాని అమరావతి గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరమని టీడీపీ నేతలు అసంతృ‌ప్తి వ్యక్తం చేశారు.

గవర్నర్‌ ప్రసంగం ప్రభుత్వం ప్రసంగంలా కాకుండా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఎంతో ఆర్భాగంగా ఆర్టీసీ విలీనమని చెప్పి మళ్లీ కమిటీలు వేయడం కాలహరణానికే అన్నారు.

అంతేకాకుండా, ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై ఎలాంతి వత్తిడి తెస్తారో క్లారిటీ లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు నెలకు రూ.5 వేల చొప్పున రూ.11 వేల కోట్లు దోచిపెట్టడానికి గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థతో సిద్ధమయ్యారని ఆరోపించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు వైసీపీ తీరు ఉందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. మొత్తం మీద గవర్నర్ ప్రసంగంపై టీడీపీ తనదైన రీతిలో వ్యాఖ్యలు చేసింది. 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   3 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   11 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   11 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   11 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   11 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle