newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

పోస్టల్ బ్యాలెట్లే బుల్లెట్లుగా మారనున్నాయా?

16-05-201916-05-2019 15:08:41 IST
2019-05-16T09:38:41.953Z16-05-2019 2019-05-16T09:31:43.078Z - - 21-08-2019

పోస్టల్ బ్యాలెట్లే బుల్లెట్లుగా మారనున్నాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఫలితాలు రావడానికి ఇంకా వారం టైం ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొంతమంది ఓటువేయలేదంటే మీరు నమ్ముతారా? అదేం పోలింగ్ బూత్‌లలో కాదండీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ, 25 స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు మూడు లక్షల మంది ఉన్నారు. వారే ప్రభుత్వ ఉద్యోగులు.

ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వారంతా ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 23న ఒకవైపు ఫలితాలు వెలువడుతుంటే మరోవైపు ఈ ప్రభుత్వ ఉద్యోగులు మూడు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 

అంతకుముందు వీరంతా తమకు పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వాటిని పరిశీలించిన ఎన్నికల సంఘం మూడు లక్షల పైచిలుకు మందికి పోస్టల్ బ్యాలెట్లను విడుదల చేసింది.

ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. ఈదశలో పోస్టల్ బ్యాలెట్లు మరింత ప్రధాన పాత్ర పోషించనున్నాయి. శాసనసభ స్థానాలకు సంబంధించి ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యధికంగా 32 వేల పోస్టల్ బ్యాలెట్‌లున్నట్టు తెలుస్తోంది. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 16 వేల పై చిలుకు పోస్టల్ బ్యాలెట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల వరకూ పోస్టల్ బ్యాలెట్‌లు ఉన్నట్టుగా అధికారులే చెబుతున్నారు.

వివిధ నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడంతో ప్రధాన పార్టీలు రెండూ ప్రతి ఓటునూ లెక్కించుకుంటున్నాయి. అందులో ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి పడతాయన్నది ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు మూడు లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వస్తాయని తేలడంతో అన్ని పార్టీల అభ్యర్థుల దృష్టి వాటిపై పడింది.

ఓటు వేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే ప్రలోభాలకు గురి చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు బుల్లెట్లుగా మారి ఏ పార్టీని ముంచుతాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉంటారో వారినే విజయం వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరైనా వందల ఓట్ల తేడాతో ఓడిపోతే.. గెలిచిన అభ్యర్ధికి ఈ పోస్టల్ బ్యాలెట్లే కీలకం అవుతాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle