newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

పోల‌వ‌రంపై బీజేపీ ఫోక‌స్..!

04-10-201904-10-2019 13:18:14 IST
2019-10-04T07:48:14.047Z04-10-2019 2019-10-04T07:48:10.511Z - - 13-12-2019

పోల‌వ‌రంపై బీజేపీ ఫోక‌స్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి లాంటి పోల‌వ‌రం సాగునీటి ప్రాజెక్టుపై బీజేపీ దృష్టిపెట్టింది. పోల‌వ‌రం వ్య‌వ‌హారంలో ఒక విధాన‌మంటూ లేకుండా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చిన బీజేపీ ఇప్పుడు దానిపై స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. పోల‌వ‌రం ప‌రిహారంలో అవినీతి జ‌రిగింద‌ని కొంద‌రు, రివ‌ర్స్ టెండ‌ర్ల వ‌ల్ల న‌ష్టం జ‌రిగింద‌ని మ‌రికొంద‌రు బీజేపీ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు.

రాష్ట్రంలో రెండు కీల‌క ప్రాజెక్టుల‌లో ఒక‌టైన రాజ‌ధాని అమ‌రావ‌తిపై త‌మ అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసిన బీజేపీ నేత‌లు పోల‌వ‌రం విష‌యంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో ప‌రిహారం విష‌యంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కొంద‌రు నేత‌లు ఆరోపిస్తూ వ‌చ్చారు. ఇప్ప‌టికీ అదే వాద‌న‌ను వినిపిస్తున్నారు.

అదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్దంటున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం రివ‌ర్స్‌టెండ‌ర్ల‌కు వెళ్లింది. దీనిపై పార్టీ నేత‌లు విమ‌ర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎంపీ సుజ‌నా చౌద‌రి దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. పోల‌వ‌రంపై ఇప్ప‌టి వ‌ర‌కు ర‌క‌ర‌కాల అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసిన బీజేపీ నేత‌లు దానిపై స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు.

గ‌తం నుంచి అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న బీజేపీ ఇప్పుడు ప్రాజెక్టు విజిట్‌కు ప్లాన్ చేసింది. ఈ నెల 11న బీజేపీ బృందం పోల‌వ‌రం ప్రాంతాన్ని సంద‌ర్శించ‌నుంది. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు ముంపు ప్రాంతాల్లో ప‌రిహారానికి సంబంధించి జ‌రిగిన‌ట్టు చెబుతున్న అక్ర‌మాల‌పై దృష్టిపెట్ట‌నుంది.

అక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా అస‌లు బీజేపీ ఇప్పుడు ఏం డిమాండ్ చేయ‌బోతుంద‌న్న‌ది తేలాల్సి ఉంది. ఓవైపు రివ‌ర్స్ టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంతోపాటు కేంద్ర‌మంత్రి కూడా వ్య‌తిరేకించారు. అయితే ఇప్పుడు రివ‌ర్స్ టెండ‌ర్ల వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం రూ.800 కోట్లు ఆదా చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. దీనిపై ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుంద‌న్న‌ది కూడా తేలాల్సి ఉంది.

మ‌రోవైపు కేంద్రం నుంచి పోల‌వ‌రానికి సంబంధించి రూ.6వేల కోట్లు పెండింగ్ నిధులు విడుద‌ల కావాల్సి ఉంది. వాటిని ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయలేదు. దీంతో అస‌లు పోల‌వ‌రం విష‌యంలో బీజేపీ లైన్ ఏంట‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇదే స‌మ‌యంలో కొంద‌రు రాజ‌కీయ నేత‌లు పోల‌వ‌రం నిర్మాణాన్ని కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మొత్తం ప‌రిణామాల నేప‌థ్యంలో పోల‌వ‌రంపై బీజేపీ స్లోగ‌న్ ఏంట‌న్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. పోల‌వ‌రం టూర్ త‌రువాత బీజేపీ నేత‌లు వైసీపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను అభినందిస్తారా..? గ‌తంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ‌కు డిమాండ్ చేస్తారా..? ప‌్రాజెక్టుకు నిధులు విడుద‌ల చెయ్య‌మ‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తారా..? అన్న‌ది సస్పెన్స్‌గా మారింది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle