newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

పోలీస్ కంప్లైంట్ పై ఆర్కె ఫైర్

27-12-201927-12-2019 09:01:38 IST
Updated On 27-12-2019 11:06:15 ISTUpdated On 27-12-20192019-12-27T03:31:38.357Z27-12-2019 2019-12-27T03:31:31.420Z - 2019-12-27T05:36:15.879Z - 27-12-2019

పోలీస్ కంప్లైంట్ పై ఆర్కె ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగళగిరి ఎమ్మెల్యేకు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోపం వచ్చింది. తాను కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో రైతులు కంప్లైంట్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు.  తాము ఆందోళనలకు దిగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే తమను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు.

ఇంట్లో జరిగే పెళ్లి కోసం హైదరాబాద్ కి వెళ్ళాల్సి వచ్చిందని అంతమాత్రానికే తనను విమర్శించడం దారుణం అంటున్నారు ఆర్కె. ఇంట్లో త్వరలో జరిగే పెళ్లి పనుల నిమిత్తం నాలుగు రోజులు హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పారు. 

నాలుగు రోజులు కనిపించనందుకే ఇంత రాద్దాంతమా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే  40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారని, టీడీపీ నేతలు దానికేం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు.  తమది రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని,రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను తాను స్వాగతిస్తానన్నారు.

ఇదిలా ఉాంటే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోలీసులు భద్రతను పెంచారు. అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆర్కె అంటున్నారు.

మరోవైపు రైతులు, స్థానికులు, మహిళలు మాత్రం అమరావతిలో తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ మౌనదీక్షకు దిగుతున్నారు. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవరాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు.

సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకం అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు.

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   14 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   17 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   18 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle