newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

పోలింగ్ ఐపోయింది పాల్.. ఇంకా కామెడీనా?

13-04-201913-04-2019 12:53:12 IST
2019-04-13T07:23:12.440Z13-04-2019 2019-04-13T07:23:10.590Z - - 21-11-2019

పోలింగ్ ఐపోయింది పాల్.. ఇంకా కామెడీనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ అంటూ ఎవరైనా వున్నారంటే ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ అనే చెప్పాలి. ఎన్నికల ప్రారంభం నుంచి ఎన్నికలు ముగిసేవరకూ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలు, చేష్టలు ఫక్తు కామెడీ షోని తలపించాయి. మండువేసవిలో కామెడీ జల్లులు కురిపించాయి. ఇక్కడ చెప్పుకోతగింది ఏంటంటే పోలింగ్ అయిపోయాక కూడా పాపం పాల్ కామెడీ షోలు మానలేదు. ప్రతి అంశంపైన ఆయన మాట్లాడే మాటలు హాస్యాన్ని పండిస్తున్నాయి. చాల సందర్భాలలో తానే అధికారంలోకి వస్తానని కూడా పాల్ చెప్పారు. తాను సీఎం అయితే చంద్రబాబు తనకు సలహాదారుగా ఉంటారని కూడా పాల్ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిశాక  ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాను పోటీ చేసిన నరసాపురంలో  వైసీపీ అభ్యర్థి అయినా రఘరామకృష్ణంరాజు గెలుస్తున్నారని చెప్పారు. అయితే నరసాపురం లోక్‌సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి, కాని ఈవిఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ చెప్పారు. కాగా ఎన్నికల కమీషన్ ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు . కాగా నాతో యువత వస్తే అవినీతి పై యుద్దం చేస్తానని అన్నారు. తమ పార్టీ అభ్యర్ధులను పోటీలో ఉండకుండా అన్ని పార్టీలు అడ్డుకున్నాయన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ విషయంతో తాను సీఎంకు మద్దతిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. 

ఢిల్లీలో ఈసీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టే పోరాటానికి అండగా వుంటానని తెలిపారు. తన అంచనా ప్రకారం 90 శాతం అక్రమాలు జరిగాయని,కేవలం పది శాతమే నిజాయితీగా, పారదర్శకంగా పోలింగ్ సాగినట్లు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రవర్తించిందని , ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. .ఏపిలో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆయన వైఎస్సార్‌సిపికి అనుకూలంగా ఓట్లు పడేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ఈవీఎం మిషన్లలో వుండే ఓ చిప్‌ను మారారని ఆరోపణలు చేశారు. అందువల్ల హెలికాప్టర్ గుర్తుకు పడాల్సిన ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పడ్డాయని...చాలా మంది ఇదే విషయాన్ని తనకు చెప్పినట్లు పాల్ వెల్లడించారు. మొత్తం మీద ఎన్నికలు ముగిశాక కూడా పాల్ కామెడీ మానడంలేదని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. 

Image may contain: 2 people, textImage may contain: 2 people

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle