newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

పోలవరాన్ని 'ఓన్' చేసుకుంటున్న బీజేపీ?

21-10-201921-10-2019 12:46:27 IST
Updated On 21-10-2019 13:41:25 ISTUpdated On 21-10-20192019-10-21T07:16:27.727Z21-10-2019 2019-10-21T07:16:20.594Z - 2019-10-21T08:11:25.948Z - 21-10-2019

పోలవరాన్ని 'ఓన్' చేసుకుంటున్న బీజేపీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశానికి స్వాతంత్య్రం రాకముందే పునాది రాయి పడిన పోలవరం ప్రాజెక్టు చివరికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక వచ్చిన గత టీడీపీ ప్రభుత్వంలో ఓ రూపు దిద్దుకుంది. కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ హోదాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని రికార్డుల స్థాయిలో పరుగులు పెట్టించారు. ఏకంగా ప్రతివారంలో ఓ రోజును ఈ ప్రాజెక్ట్ కోసమే కేటాయించారంటే ఆ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వచ్చినా.. ముందుగా పనులకు బ్రేక్ పడకుండా రాష్ట్ర నిధులను ఖర్చు పెట్టి రీఎంబర్స్ మెంట్ చేసుకోనేంతగా డెడికేషన్ పెట్టారు.

కారణాలేమైనా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చిందే తడువుగా పాతసంస్థను నిర్మాణ ఒప్పందం నుండి తప్పించి రివర్స్ టెండరింగ్ పేరుతో మరో సంస్థకు అప్పగించారు. ముందు ఒప్పంద సంస్థ తమ కాంట్రాక్టు రద్దుపై కోర్టుకు చేరగా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇంతకు ముందు ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని లెక్కలు తేల్చాలని ఈ ప్రభుత్వం పోలవరం విషయంలో తీవ్ర నిర్ణయాలను తీసుకుంది. ఫలితంగా గత ఐదు నెలలుగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి కదలిక లేదు. ఒక్కటంటే ఒక్క తట్ట కాంక్రీట్ వేయలేదు.

ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వర్షాలు, వర్షపు నీరు నిల్వ ఉందని, నవంబర్ తర్వాత మాత్రమే నిర్మాణం మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే గత ఐదు నెలలుగా జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాటలను ఎంతవరకు నమ్మాలి అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే గత ఐదు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఆ ప్రాజెక్ట్ భవిష్యత్ మీద పడుతుండడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టింది.

నిజానికి వందకు వంద శాతం కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం తన ప్రాజెక్టుగా ఓన్ చేసుకుంది. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో ప్రాజెక్ట్ పూర్తయితే తెలుగు దేశానికి కూడా అంత గుడ్ విల్ వచ్చే విధంగా ఆ ప్రాజెక్టు మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే విధంగా ప్రాజెక్టును ఓన్ చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ మధ్య ఆగష్టులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రాజెక్టును సందర్శించి అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై అప్పటికి జరిగిన పనులు, పరిస్థితులను కేంద్రానికి వివరించారు.

ఇక ఈ నెలలో మరోసారి బీజేపీ నేతలు బృందంగా ఏర్పడి పోలవరంను సందర్శించి పూర్తిస్థాయి పరిస్థితులను అంచనావేసి కేంద్రానికి నివేదిక అందించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులపై ఊసెత్తని బీజేపీ ఈ ప్రభుత్వంలో యాత్రలు చేసి మరీ పర్యవేక్షించడం వెనుక మర్మం ఏమిటన్నది ఆసక్తికర అంశం కాగా త్వరలోనే ప్రాజెక్ట్ అథారిటీతో కేంద్ర పెద్దలు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నట్లుగా తెలుస్తుంది. కొత్త కాంట్రాక్టర్లపై ససేమీరా వద్దంటూ తేల్చేసిన అథారిటీ ఏపీ ప్రభుత్వం మీద ఎలాంటి విషయాలను కేంద్రానికి చెప్పనున్నారు? అన్నది కూడా ఆసక్తికరంగానే మారింది.

మరోవైపు ఇంతకు ముందున్న కాంట్రాక్ట్ సంస్థ నవయుగ కోర్టుకి చేరగా అది ఎప్పటికి తేలనుందో తెలియదు. రివర్స్ టెండర్లతో ఆదా చేశామంటూ ప్రభుత్వం అథారిటీని కూడా లెక్కచేయక ముందుకెళ్తుంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు మీద ఏమైనా కీలక నిర్ణయాలను తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వమే నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుందా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ముందుగా ప్రాజెక్ట్ అథారిటీతో కేంద్ర పెద్దలు సమావేశమైతే కానీ ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle