newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

పోలవరం అవనీతి రాజకీయ నినాదమేనా?

04-08-201904-08-2019 17:10:00 IST
Updated On 04-08-2019 17:11:23 ISTUpdated On 04-08-20192019-08-04T11:40:00.556Z04-08-2019 2019-08-04T11:39:56.328Z - 2019-08-04T11:41:23.757Z - 04-08-2019

పోలవరం అవనీతి రాజకీయ నినాదమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ కు జీవధార అయిన పోలవరం నిర్మాణం కొనసాగుతుందా అన్న సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. విపక్ష నేతగానూ, అధికారంలోనికి వచ్చిన తరువాత కూడా వైకాపా అధినేత, సీఎం జగన్ పోలవరం అవినీతి మయం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ కూడా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని విమర్శించారు.

ఇప్పుడు టెండర్లను రద్దు చేసిన తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అది సరి కాదని పేర్కొన్నారు. అసలింతకీ పోలవరం ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ పోలవరంలో అవినీతి అన్నది రాజకీయ నినాదంగా మారితేనే అభ్యంతరం. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై విపక్షంలో ఉండగానే వైకాపా విమర్శలు చేస్తూ వచ్చింది. అలాగే అనేక అవకతవకలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు వచ్చాయి. కేంద్రం కూడా ఈ విషయంలో అనేకానేక అనుమానాలు వ్యక్తం చేసింది. విపక్షంలో ఉండగా ప్రస్తుత సిఎం వైఎస్‌ జగన్‌ ఏనాడూ పోలవరాన్ని సందర్శించక పోవడానికి కూడా ఇదే కారణంగా చెబుతారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం నిర్మించాల్సి ఉన్నా వ్యయం కేంద్రానిదీ, నిర్మాణ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదీ కావడమే పోలవరం విషయంలో ఇన్ని అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవ్వడానికి, వెల్లువెత్తడానికీ కారణం అయి ఉండవచ్చు. కానీ అవినీతి నిగ్గు తేల్చడానికి ఒక వ్యవస్థ ఉంది. రాజకీయ ఆరోపణలతో రాష్ట్రానికి జీవధార వంటి ప్రాజెక్టు కుంటుపడే పరిస్థితి రావడమే శోచనీయం. 

ఇదే విషయాన్ని లోక్ సభ సాక్షిగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. గత ప్రభుత్వం కూడా ప్రధాన కాంట్రాక్టర్ దివాళా స్థితికి చేరుకుని చేతులెత్తేసినప్పుడు టెండర్లు రద్దు చేయకుండా ప్రాజెక్టు వేగాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించిందనీ, అందులో భాగమే కాంట్రాక్టర్ మార్పు అనీ చెప్పారు.  అయినా పోలవరంలో అవినీతికి ఆస్కారం ఉండే అవకాశం లేదు. ఒక వేళ ఉంటే అది కేంద్రం అనుమతితోనే జరిగి ఉండాలి. ఎందుకంటే పోలవరం నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే ఏపీ సర్కార్ ది మిగిలినవన్నీ కేంద్రం అనుమతితో, కేంద్రం కనుసన్నలలోనే జరిగాయి. జాతీయ ప్రాజెక్టు కనుక అన్నీ కేంద్రం అధీనంలోనే ఉంటాయి.  ఇదే విషయాన్ని ఇప్పుడు కేంద్ర మంత్రి షెకావత్ కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు టెండర్ల రద్దుతో పోలవరం పనులు జాప్యం అవడం తధ్యమన్న భావన వ్యక్తమౌతున్నది. ఏపీకి నీటి కొరత తీర్చే బృహత్తర ప్రాజెక్టు ఇలా రాజకీయ కారణాలతో వెనక్కు వెళ్లడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే    ఏపీ  ప్రజలు కూడా పోలవరం ఇలా రాజకీయ పార్టీల మధ్య నలిగిపోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం తప్ప మరో ప్రయోజనం ఉండదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అవినీతి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది నిజమే పనులను ఆపివేయడం ఒక్కటే పరిష్కారం అన్న తీరే సరికాదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle