newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

‘పోలవరం’పై నవయుగ పిటిషన్.. కోర్టు ఏం చెబుతుందో?

20-08-201920-08-2019 09:05:28 IST
Updated On 20-08-2019 11:09:58 ISTUpdated On 20-08-20192019-08-20T03:35:28.835Z20-08-2019 2019-08-20T03:34:54.195Z - 2019-08-20T05:39:58.684Z - 20-08-2019

‘పోలవరం’పై నవయుగ పిటిషన్.. కోర్టు ఏం చెబుతుందో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివిధ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న రీ టెండరింగ్ విధానంపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు రద్దు చేయడంపై నవయుగ కంపెనీ మండిపడుతోంది.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగ కంపెనీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తమ సంస్థ ఆర్ధికంగా నష్టపోవడంతో పాటు ప్రతిష్టను కోల్పోతుందని కోర్టుకు తెలిపింది. 

పోలవరం పనులు వేగంగా కొనసాగించడానికి తాము సబ్‌కాంట్రాక్టర్లకు చెల్లింపులు కూడా చేశామని, ప్రభుత్వం సహేతుక కారణాలేమి చూపించకుండా తమను తప్పించిందని పిటిషన్‌లో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుతో పాటు ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీని తొలగించి నవయుగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 

దీంతో నవయుగ పోలవరం ప్రాజెక్టులో గత కొంతకాలంగా పనులు చేపడుతూ నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ పనులకు సంబంధించి పలు సబ్‌కాంట్రాక్టర్లను నియమించుకొని పనులు చేపట్టింది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకుందని పేర్కొంటూ కాంట్రాక్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్‌ 31న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి నవయుగ కంపెనీకి పనులు రద్దు చేయాలని ఆదేశించారు. 

జూలై 14న ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరో వైపు ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రాజెక్టు పనులను సమీక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రివర్స్‌ టెండరింగ్‌ చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సీరియస్‌ అవ్వడంతో పాటు ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ను ఆదేశించింది.

ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ నవయుగ కంపెనీ డైరెక్టర్‌ వై.రమేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేరే సంస్థలకు అప్పగించకుండా చూడాలని నవయుగ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle