newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పోలవరంపై చిత్తశుద్ది ఏదీ?

25-08-201925-08-2019 09:54:03 IST
2019-08-25T04:24:03.827Z25-08-2019 2019-08-25T04:23:52.783Z - - 20-09-2019

పోలవరంపై చిత్తశుద్ది ఏదీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం ప్రాజెక్టుని త్వరతిగతిన పూర్తిచేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.  పోలవరం టెండర్లను ఎందుకు రద్దు చేశారో వారికే తెలియదంటూ విరుచుకు పడ్డారు.

ఏకపక్షంగా నవయుగ టెండర్లను రద్దు చేశారని, కోర్టు మందలింపులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు రాజధాని అమరావతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికి క్లారిటీ లేదంటూ ధ్వజమెత్తారు. 

మంత్రి స్థానంలో ఉండి అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని.. మంత్రి బొత్సపై సెటైర్లు వేశారు. అమరావతిలో రాజధాని ఉంటుందో లేదో అన్న అంశంపై సీఎం జగన్ ప్రకటన విడుదల చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. 

రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో భేటీ అయిన రామకృష్ణ..  అమరావతి నుంచి రాజధాని తరలింపు జరగకుండా చూడాలని వివిధ పార్టీలను అక్కడి రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు. 

రైతులు రాష్ట్ర రాజధానికి 33వేల ఎకరాలకు పైగా భూములు ఇస్తే. వారికి కౌలు చెల్లించకపోవడం దారుణం అని సీపీఐ నేత అంటున్నారు. రాజధానిపై రాష్ట్రంలో ఇంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ సీఎం జగన్ స్పందించకపోవడం ఏంటన్నారు.

రాజధానిపై జగన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది కోసం రాజధానిని దొనకొండలో పెడితే అక్కడ అభివృద్ధి చెందుతుందా అంటూ నిలదీశారు. జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇసుక కొరతతో లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడినా పట్టించుకోవడం లేదన్నారు. నూతన పాలసీ వచ్చే వరకు కనీసం పాత పాలసీని అయినా అమలు చేస్తే బాగుండేదని సీపీఐ రామకృష్ణ సూచించారు. గత ప్రభుత్వ విధానాలను సమీక్షించడం మంచిదని, దూకుడుగా వాటిని రద్దుచేయడం ప్రజలకు ఇబ్బందికరం అన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle