newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

పోలవరంపై ఏపీ బీజేపీ నయా స్కెచ్

12-10-201912-10-2019 10:26:15 IST
Updated On 12-10-2019 10:26:08 ISTUpdated On 12-10-20192019-10-12T04:56:15.325Z12-10-2019 2019-10-12T04:52:42.379Z - 2019-10-12T04:56:08.424Z - 12-10-2019

పోలవరంపై ఏపీ బీజేపీ నయా స్కెచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అధికార వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంటోంది. టీడీపీ నేతల వలసలతో బీజేపీ బలం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటు పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండుపార్టీలు విమర్శలు-ప్రతి విమర్శలకు దిగుతున్నాయి.

ఆంధప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు బీజేపీ బృందం సభ్యులు శుక్రవారం అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే.

పోలవరం సందర్శన అనంతరం ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్ సర్కార్ కు పోలవరంపై శ్రద్ధ అసలు లేనేలేదన్నారు.

ఏపీకి గుండె వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులలో అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళితే బాగుండేదని కన్నా అభిప్రాయపడ్డారు. 

Image may contain: 11 people, people smiling, outdoor

పోలవరం ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రం భరిస్తుందని..త్వరలో పోలవరం పనులను కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ఈసందర్భంగా చంద్రబాబు గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుసరించిన వైఖరిని బీజేపీ తప్పుబట్టింది. గత ప్రభుత్వం ప్రతి సోమవారం పోలవారం అంటూ పోలవరాన్ని ఒక పర్యాటక అంశంగా మార్చేస్తే, వైసీపీ ప్రభుత్వం పోలవరంని పట్టించుకోవడం లేదన్నారు. 

వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అవినీతి చేసిందని బూచిలా చూపించి లబ్ధి పొందాలని చూస్తుందని కన్నా లక్ష్మీనారాయణ గారు ఎండగట్టారు.గత ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేసిందో ఎంక్వయిరీ చేసి బహిరంగంగా నిజాలు వెలికి తీయాలని ఆయన సూచించారు.

పోలవరం ప్రాజెక్ట్ సందర్శన కార్యక్రమంలో బీజేపీ సహా ఇంఛార్జ్,జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు,బీజేపీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం పాల్గొన్నారు. 

Image may contain: one or more people, people standing, sky, mountain, outdoor, nature and water

పోలవరం విషయంలో బీజేపీ వైఖరి మారుతోంది. ఏపీలో రాజకీయంగా ప్రజల్లో ఇమేజ్ పెరగాలంటే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత నిధులు ఇస్తూ..ఆ క్రెడిట్ ఏపీ ప్రభుత్వానికే దక్కుతోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు దిగారు. తరచూ పోలవరం అంశాన్ని ప్రజల్లోకి తీసికెళ్లాలని నిర్ణయించారు. 

ఏపీలో గతంలో అమలయిన కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం నిధులతో ఏపీలో అమలు చేస్తున్న ప్రాజెక్టులను కేంద్రమే స్వయంగా నిర్వహించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది. బీజేపీ ఇమేజ్ పెరగడానికి ఈ తరహా విధానం అవసరమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు. అందులో ఇప్పుడు పోలవరం పైన నేతలు ఫోకస్ చేస్తున్నారు.

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   an hour ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   2 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   10 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   10 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   10 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   10 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   10 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle