newssting
BITING NEWS :
*ఏపీలో ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై వెన‌క్కి త‌గ్గుతున్న కార్పొరేట్ స్కూళ్లు.. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవ‌ంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు *దేశంలో కరోనా వీరవిహారం... దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 613 మంది మృతి, 6,73,165కు చేరిన పాజిటివ్ కేసులు, 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ *నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం *నెల్లూరు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1008... యాక్టివ్ కేసులు 462.. మృతుల సంఖ్య 19*హైద‌రాబాద్‌: నేటి నుంచి బేగంబ‌జార్ మార్కెట్ ఓపెన్*హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా దందా..గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో కరోనాతో నాగరాజు అనే వ్యక్తి మృతి..డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులు..ఆస్పత్రి తీరుపై బంధువుల ఆందోళన *డీజీపీ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగా డ్రగ్స్ కలకలం..డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు అరెస్ట్..నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం *ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు..మొత్తం 10,17,123 కరోనా టెస్టులు *ఏపీలో కొత్తగా 99 8 కరోనా కేసులు. 14 మరణాలు. ఏపీలో మొత్తం 18,697కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 232 కరోనా మరణాలు. 10043 యాక్టివ్ కేసులు ఉండగా, 8422 మంది కోలుకొని డిశ్చార్జ్

పోరుగడ్డ... ఆళ్ళగడ్డ ... ఎవరి అడ్డా?

24-03-201924-03-2019 08:31:24 IST
2019-03-24T03:01:24.093Z24-03-2019 2019-03-24T03:01:17.832Z - - 06-07-2020

పోరుగడ్డ... ఆళ్ళగడ్డ ... ఎవరి అడ్డా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాంబులగడ్డ ఆళ్లగడ్డ పోరు జనంలో రోజు రోజుకూ టెన్షన్ పెంచుతోందట. మొదటి నుంచీ ప్రత్యర్థులైన భూమా, గంగుల కుటుంబాలు ఈసారి కూడా ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నాయి. ముఖ్యంగా వర్గ రాజకీయాలకు పైరైన ఆళ్లగడ్డలో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. 

1985 నుంచీ నేటి దాకా జరిగిన ఎన్నికల్లో గంగుల కుటుంబం 5 సార్లు గెలిస్తే, భూమా కుటుంబం 9 సార్లు విజయంతో పట్టు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థిగా గంగుల బ్రిజేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన పోటీ ఇక్కడ నామమాత్రమే అనేది స్పష్టం. ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, శిరువెళ్ల, ఉయ్యాలవాడ, డోర్నపాడు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో బలిజలదే ప్రధాన ఓటింగ్.

 ఆ తర్వాత బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. రెడ్ల ఓటింగ్ తక్కువే అయినా, మొదట్నించీ పెత్తనం మొత్తం వారిదే. ఇక అఖిల ప్రియ విషయానికొస్తే... భూమా కుటుంబ రాజకీయ నేపథ్యం ఆమెకు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మంత్రిగా దాదాపు 2 వేల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినట్లు అఖిల ప్రియ చెప్పుకుంటున్నారు. ఆమె చెప్పినట్లు ఆళ్లగడ్డలో అభివృద్ధి జరిగితే కచ్చితంగా అఖిల ప్రియకు అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ముఠా తగాదాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు అఖిల ప్రియకు ఇబ్బందిగా మారాయట. 

ఇక మేనమామ ఎస్వీ సుబ్బారెడ్డి వైసీపీలో చేరడం మరో మైనస్ పాయింట్. అలాగే మొదటి నుంచీ భూమ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న ఇరిగెల వర్గం కూడా వైసీపీతో చేతులు కలిపింది. ఇక భూమా నాగిరెడ్డికి ఆప్త మిత్రుడైన ఏ.వీ. సుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికలు అఖిల ప్రియకు కత్తిమీద సాములా మారాయట. ఇక వైసీపీ లోక్ సభ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, ఉయ్యాలవాడ మండల వాసి కావడంతో అక్కడి ఓట్లు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయట. 

ఇది కూడా అఖిలప్రియకు మైనస్ అవుతుందట. ఇక వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేందర్ రెడ్డి విషయానికొస్తే... బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న గంగుల కుటుంబానికి ఇప్పుడు ఇరిగెల వర్గం, ఏ.వీ. సుబ్బారెడ్డి వర్గం మద్దతు పలకడం ప్లస్ పాయింట్స్ అవ్వనున్నాయి. అయితే తన పెదనాన్న గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉండటం ఇబ్బంది పెట్టే అంశంగా మారినా, జగన్ హవా తనను గెలిపిస్తుందని బ్రిజేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు అటు భూమా, ఇటు గంగుల కుటుంబాలకు సవాల్‌గా మారాయి.

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

   an hour ago


తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

   an hour ago


అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

   2 hours ago


అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

   2 hours ago


కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

   3 hours ago


ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

   3 hours ago


కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

   16 hours ago


సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

   16 hours ago


కరోనా కాటు.... ప్రైవేటు హాస్పిటల్ వన్డే బిల్లెంతో తెలుసా?

కరోనా కాటు.... ప్రైవేటు హాస్పిటల్ వన్డే బిల్లెంతో తెలుసా?

   17 hours ago


మళ్లీ లాక్ డౌన్‌‌పై కేసీయార్ వెనకడుగు.. అందుకేనా?

మళ్లీ లాక్ డౌన్‌‌పై కేసీయార్ వెనకడుగు.. అందుకేనా?

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle