newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పోరాటానికి టీడీపీకి అస్త్రాలు దొరికాయోచ్....!

02-07-201902-07-2019 07:46:27 IST
2019-07-02T02:16:27.754Z02-07-2019 2019-07-02T02:16:07.285Z - - 22-09-2019

పోరాటానికి టీడీపీకి అస్త్రాలు దొరికాయోచ్....!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల పాటు స‌మ‌యం ఇస్తామ‌ని, అప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు చేయ‌మ‌ని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఖ‌రి మార్చుకుంది. స‌రిగ్గా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారం చేసి నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టిన టీడీపీ నేత‌లు ఇప్పుడు మ‌రింత ఉధృతం చేశారు. ప్ర‌తీరోజూ ట్విట్ట‌ర్‌, మీడియా వేదిక‌గా టీడీపీ నేత‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ప్ర‌ధానంగా టీడీపీ రెండు కార‌ణాల‌ను వెతుక్కుంది. ఇందులో మొద‌టిది త‌మ కార్య‌కర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ కాగా రెండోది రాష్ట్రంలో ఏర్ప‌డిన విత్త‌న కొర‌త‌. ఇప్పుడు ఈ రెండు అంశాల‌తోనే చంద్ర‌బాబు, లోకేశ్ స‌హా టీడీపీ నేత‌లంతా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రాష్ట్రంలో త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై 150కి పైగా దాడులు జ‌రిగాయ‌ని, ఆరుగురు కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య చేశార‌నేది తెలుగుదేశం పార్టీ ఆరోప‌ణ‌. దీనిపై డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్ సైతం మంగ‌ళ‌గిరిలో హ‌త్యకు గురైన టీడీపీ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఇప్పుడు నేరుగా చంద్ర‌బాబు నాయుడు రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గుంటూరులో జ‌రిగిన పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో ఆయ‌న ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నారు.

త్వ‌ర‌లోనే దాడుల‌కు గురైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు, హ‌త్య‌ల‌కు గురైన వారి కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. టీడీపీ నేత‌లు ఇది రాజ‌న్న రాజ్యం కాద‌ని రాక్ష‌స రాజ్యం అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, వైసీపీ మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేస్తోంది. టీడీపీకి కౌంట‌ర్‌గా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి సైతంత డీజీపీని క‌లిసి టీడీపీ వారే త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్నార‌ని, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు.

ఇక‌, రాష్ట్రంలో ఏర్ప‌డిన వేరుశ‌న‌గ విత్త‌నాల కొర‌త వ‌ల్ల రైతులు ఇబ్బంది ప‌డుతున్నారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఈ స‌మ‌స్య అధికంగా ఉంది. విత్త‌నాల కోసం రైతులు రోజుల త‌ర‌బ‌డి ఎదురు చూడాల్సి వ‌స్తోంది. ఈ అంశాన్ని టీడీపీ బాగా ఉప‌యోగించుకుంటోంది. రైతుల‌కు విత్త‌నాలు కూడా ఇవ్వ‌లేని ముఖ్య‌మంత్రి నీళ్లు ఇస్తారా అని నారా లోకేశ్ ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారు. జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని టీడీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది.

వైసీపీ మాత్రం ఈ ప్ర‌చారాన్ని తిప్ప‌కొడుతోంది. తాము అధికారంలోకి వ‌చ్చి నెల రోజులే అవుతుంద‌ని, కాబట్టి విత్త‌న కొర‌త‌కు బాధ్య‌త, త‌ప్పు గ‌త ప్ర‌భుత్వానిదే అని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి క‌న్న‌బాబు ఆరోపిస్తున్నారు.

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌గానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విత్త‌న కొర‌త‌పై స‌మీక్ష జ‌రిపి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశించార‌ని, టీడీపీ ప్ర‌భుత్వం ఏపీసీడ్స్‌కు రూ.300 కోట్ల‌కు పైగా బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు విత్త‌న కొర‌త ఏర్ప‌డింద‌ని చెబుతోంది.

ప్రభుత్వ వాద‌న ఎలా ఉన్నా ఈ రెండు అంశాల‌ను ఎంచుకొని ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ బాగా ఉప‌యోగించుకుంటోంది. ఆరు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వంపై పోరాటం ప్రారంభించాల‌నుకున్న టీడీపీకి నెల రోజుల‌కే చేతినిండా ప‌ని దొరికింది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle