newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

పోయి పోయి వంశీతో పెట్టుకున్నామే.. తలపట్టుకున్న టీడీపీ

16-11-201916-11-2019 11:16:41 IST
Updated On 16-11-2019 12:04:19 ISTUpdated On 16-11-20192019-11-16T05:46:41.967Z16-11-2019 2019-11-16T05:45:41.760Z - 2019-11-16T06:34:19.763Z - 16-11-2019

పోయి పోయి వంశీతో పెట్టుకున్నామే.. తలపట్టుకున్న టీడీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై యధాప్రకారంగా దాడి చేద్దామనుకున్న టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయంటే అతిశయోక్తి  కాదు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మొదలుకుని టీడీపీ నాయకులు వర్ల రామయ్య, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధల వరకు వరుసగా విలేకరుల సమావేశం నిర్వహించి వంశీపై ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ వారికంటే రెండాకులు ఎక్కువే తిన్న వంశీ తెలుగుదేశం నేతల లోపాయికారీ బాగోతం మొత్తం బయటపెట్టేశారు. దీంతో టీడీపీ పరువు పూర్తిగా పోవడమే కాదు నాయకత్వం తలలు పట్టుకున్నంత పనయింది.

మీడియా దన్నుతో వంశీని ఒక ఆటాడుకుందామనుకుని శుక్రవారం వరుసగా విలేకరుల సమావేశం నిర్వహించి మాటలతో దాడిచేసిన టీడీపీ నేతలకు వంశీకూడా తన వంతుగా మీడియా ముందుకు వచ్చి దిమ్మ తిరిగిపోయేలా ప్రతిదాడి చేయడం సంచలన కలిగించింది. అటు గన్నవరం, విజయవాడ స్థానిక టీడీపీ నేతల నిర్వాకాలను ఎండగట్టడంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై కూడా వంశీ ముప్పేట దాడి చేశారు.

టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఎన్నికల్లో గెలవలేరని, అయితే 25 లీటర్ల డీజిల్, బిర్యానీ ప్యాకెట్లు, ఐదు వేలు నగదు ఇస్తే ఎవరినైనా తిడతారంటూ వంశీ ఘాటుగా విమర్శించారు. మరొక నాయకుడు కొనకళ్ల నారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బాడిగ రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. మాజీ మంత్రి ఒకరు వేస్ట్‌ ఫెలో అని.. ఆయన వల్లే జిల్లాలో పార్టీ నాశనం అవుతోందంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో జరిగిన.. జరుగుతున్న బాగోతాలను వంశీ పూసగుచ్చినట్లు వివరించడంతో టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. వంశీ మోహన్‌ తెలుగుదేశం పార్టీ వీడిపోతుంటే ఆయనను వ్యక్తిగత విమర్శలతో ఇరికిద్దామనుకున్న టీడీపీ నేతలకు ఊహించని షాక్‌ తగిలింది. తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విషయాలను వంశీ ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఏమి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు తాను చెప్పింది 10 శాతమేనని అవసరమైతే ఇంకా అనేక విషయాలు బయటపెడతానని చెప్పడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. 

ఈ మధ్య కాలంలో టీడీపీ అధినాయకత్వంపై వంశీ చేసినంతగా ఎవరూ దాడి చేయకపోవడం గమనార్హం. జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఎన్నికల తర్వాత టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదని, ఆ కుటుంబాన్ని అవసరానికి వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై వంశీ నిప్పులు చెరిగారు. ‘తన రెండెకరాల పొలంతోనే చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారా? వ్యవసాయం చేసి పార్టీ ఫండ్‌ ఏమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్‌లు తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. 

లోకేష్‌ చచ్చు దద్దమ్మ కాబట్టే మంగళగిరిలో ఓడిపోయాడని, సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని లోకేష్‌ బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని లోకేష్‌, ప్రధాని కావాలని చంద్రబాబు పళ్లు రాలగొట్టుకున్నారని విమర్శించారు. తనను ఎవరూ ప్రభావితం చేయలేరని, మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటానన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేసింది కాబట్టి అభినందించానని, తన నియోజకవర్గం కోసం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని తెలిపారు.  

‘పార్టీకి రాజీనామా చేశాక నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?. వయసు మీద పడడంతో చంద్రబాబు మతి చలించి మాట్లాడుతున్నాడు. కొడుకుని గెలిపించుకోలేకపోయాడు. లోకేష్‌ ముద్ద పప్పు.. అతన్ని మాపై రుద్దాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్‌ పెద్ద గుదిబండ, స్పీడ్‌ బ్రేకర్‌ అని, అతని వల్ల పార్టీ ముందుకు వెళ్లలేదని వంశీ విమర్శించారు. తాను బయటికెళ్తే టీడీపీకి నష్టం లేదని, లోకేష్‌ పార్టీలో ఉంటేనే పెద్ద నష్టమని పేర్కొన్నారు.  

చంద్రబాబుకు తనను సస్పెండ్‌ చేసేంత సీను లేదని, దమ్ముంటే బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయాలని వల్లభనేని వంశీ సవాల్‌ విసిరారు. ఆ రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకున్నందుకు మోదీ, అమిత్‌షా ఇంటి వద్ద చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. సోషల్‌ మీడియాలో తన క్యారెక్టర్‌ను నాశనం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందువల్లే టీడీపీలో జరిగిన వాస్తవాలన్ని బయట పెడుతున్నానని వంశీ చెప్పారు.

ఈ మొత్తం దాడి ప్రతిదాడుల పర్వం ఇరుపక్షాలూ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో ముగిసింది.

 

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   2 minutes ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   13 minutes ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   28 minutes ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   an hour ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   an hour ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   2 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   15 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   16 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   16 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle